ఆ సినిమా నిర్మాతను బహిరంగంగా ఉరి తీయాలి
ముంబై: బాలీవుడ్ మూవీ ది కేరళ స్టోరీ రాజకీయంగా దుమారం రేపుతోంది. కేరళకు చెందిన వేలాదిమంది మహిళలు మాయం అవుతున్నారని, లవ్ జిహాద్ పేరుతో వాళ్లంతా బలవంతంగా మత మార్పిడికి గురవుతున్నారని, ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ సిరియా అండ్ లెవాంట్‌లో చేరుతున్నారనేది ఈ సినిమా సారాంశం. దీని చుట్టూ కథను అల్లుకుని తెరకెక్కించారు దర్శకుడు సుదీప్తొ సేన్.
అదా శర్మ లీడ్ క్యారెక్టర్‌లో నటించారు. యోగితా బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నాని, దేవదర్శిని, విజయ్ కృష్ణ, ఇతర పాత్రలను పోషించారు. 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కింది ది కేరళ స్టోరీ. సన్ షైన్ బ్యానర్స్ కింద నిర్మాత విపుల్ షా ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 5వ తేదీన ఈ సినిమా విడుదలైంది. రాజకీయ దుమారానికి కేంద్రబిందువయింది.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ సినిమా కథాంశాన్ని తప్పుపట్టారు. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించారంటూ మండిపడ్డారు. మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటీషన్లు కూడా దాఖలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈ సినిమా ప్రదర్శనను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయంగా ప్రకటించారు.
తాజాగా ఈ సినిమా వివిధ పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ది కేరళ స్టోరీ సినిమా నిర్మాతను బహిరంగంగా ఉరి తీయాలంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి జితేంద్ర అవ్హాద్ డిమాండ్ చేశారు. కేరళకు చెందిన 32,000 మంది మహిళలు తప్పిపోయి ఐసిస్‌లో చేరినట్లు ఓ ఊహాజనిత కథను సృష్టించి, సినిమా పేరుతో జనం మీదికి వదిలారని విమర్శించారు.
ఈ సినిమా కథాంశం మొత్తం ఫిక్షన్ అని కొట్టి పారేశారాయన. కేరళ స్టోరీ పేరుతో మన ఆడపిల్లల పరువును మనమే తీస్తోన్నామంటూ జితేంద్ర అవ్హాద్ ధ్వజమెత్తారు. మన ఆడపిల్లలు మూర్ఖులుగా, ఏమీ అర్థం చేసుకోలేని బలహీన మనస్కులుగా, పురుషాధిక్య సమాజంలో బందీలుగా చిత్రీకరించారని ఆరోపించారు. మత విధ్వేషాలను రెచ్చగొట్టడం, హింసను సృష్టించడం, ఎన్నికల్లో లబ్దిపొందాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తీసినట్లు చెప్పారు.

ది కేరళ స్టోరీ సినిమా ఆ రాష్ట్రంలో నివసించే మహిళలను పరువు తీస్తోందని జితేంద్ర అవ్హాద్ ధ్వజమెత్తారు. కల్పిత కథతో సినిమా తీసిన నిర్మాతను బహిరంగంగా ఉరితీయాలని అన్నారు. ఈ సినిమాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్దేశించడాన్ని ఆయన స్వాగతించారు. ఈ సినిమాను నిషేధించి ముఖ్యమంత్రి మమత బెనర్జీ మంచి నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.
-
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
రెహ్మాన్ డకైత్ వర్సెస్ మేజర్ ఇక్బాల్.. అసలైన విలన్ ఎవరు? -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications