తల్లికిచ్చిన మాట కోసం అమెరికా నుంచి రాంచీకి (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

రాంచీ: అమెరికాలో ప్రొఫెసర్‌గా పనిచేసే దేబాశిశ్ బెనర్జీ(65) తన తల్లికి ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చేందుకు పెద్ద ప్రయత్నమే చేశాడు. వివరాల్లోకి వెళితే... 30 ఏళ్ల క్రితం జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన బెనర్జీ చదువు నిమిత్తం అమెరికా వెళుతూ అమెరికా నుంచి రాంచీకి తిరిగి వచ్చేటప్పుడు సొంత ఎయిర్‌క్రాఫ్ట్‌లోనే వస్తానని తల్లికి వాగ్ధానం చేశాడు.

చదువు పూర్తైన తర్వాత అమెరికాలో ప్రొఫెసర్‌గా స్థిరపడిన బెనర్జీ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం సొంత ఎయిర్‌క్రాప్ట్‌లో ఇన్నాళ్లకు తిరిగి స్వదేశానికి వచ్చాడు. 2005లో ప్లైయింగ్ లైసెన్స్‌ను పొందిన బెనర్జీ అనంతరం సొంతంగా ప్రయాణించేందుకు నిర్ధిష్ట కాలపరిమితిపై అనుమతికోసం ఎంతగానో శ్రమించాడు.

తల్లికిచ్చిన మాట ప్రకారం ఆమెరికా నుంచి రాంచీకి వచ్చేందుకు ఈ ఏడాది సిద్ధమయ్యాడు. ఇలా పలు అనుమతుల కోసం మూడు సంవత్సరాల శ్రమ, రూ. 35 లక్షల ఖర్చు, సింగిల్ ఇంజిన్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో 14 దేశాల నుంచి ప్రయాణించి మొత్తంమీద తన కలను సాకరం చేసుకుని చివరకు రాంచీకి చేరుకున్నాడు.

తల్లికిచ్చిన మాట కోసం అమెరికా నుంచి రాంచీకి

తల్లికిచ్చిన మాట కోసం అమెరికా నుంచి రాంచీకి

అయితే తన వాగ్ధానాన్ని, కలను సాకారం చేసుకున్నా ప్రొఫెసర్ బెనర్జీ అంసతృప్తితో వెనుతిరుగుతున్నాడు. ఎందుకంటే బెనర్జీ తల్లి ఇప్పడు జీవించిలేదు. విషాదం ఏమిటంటే సొంత ఎయిర్‌క్రాఫ్ట్‌తో తిరిగి వస్తానని బెనర్జీ వాగ్ధానం చేసిన కొన్ని రోజులకే ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది.

తల్లికిచ్చిన మాట కోసం అమెరికా నుంచి రాంచీకి

తల్లికిచ్చిన మాట కోసం అమెరికా నుంచి రాంచీకి

కాగా తన తల్లికి ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చుకునేందుకు ప్రొఫెసర్‌కు ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సందర్భంగా రాంచీకి వచ్చిన ప్రొఫెసర్‌ జాతీయ మీడియాకు ఇంటర్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్యూలో నా వాగ్ధానం, కల ఆమె బాధను కొంతమేరకైనా తగ్గించిందనుకుంటున్నానని చెప్పారు.

తల్లికిచ్చిన మాట కోసం అమెరికా నుంచి రాంచీకి

తల్లికిచ్చిన మాట కోసం అమెరికా నుంచి రాంచీకి

ఆ బాధలో ఆమె జీవితం మరికొన్ని రోజులు పెరిగిందనుకుంటున్నానని ఆయన పేర్కొన్నాడు. కాగా, ప్రొఫెసర్ శనివారం కోల్‌కత్తా మీదుగా అమెరికా తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ ప్రయాణంలో తన తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చడంతో పాటు డయాబెటిస్‌పై అవగాహన కోసం ప్రచారం చేస్తున్నాడు.

తల్లికిచ్చిన మాట కోసం అమెరికా నుంచి రాంచీకి

తల్లికిచ్చిన మాట కోసం అమెరికా నుంచి రాంచీకి

ఇందులో భాగంగా తన ఎయిర్‌క్రాఫ్ట్ రెబెకా తోక భాగంలో రైసింగ్ అవేర్‌నెస్ ఆఫ్ డయాబెటీస్ అని పెయింట్ చేయించాడు. మొత్తంమీద ప్రొఫెసర్ తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సొంత విమానంలో సొంతంగా నడుపుకుంటూ రాంచీకి తిరిగివచ్చినా అంసతృప్తితోనే వెనుతిరుగడం ఎంతో బాధాకరం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rs. 35 lakh, three years of working out the permissions and navigating his single-engine aircraft through 14 counties - for 65-year-old Debashish Bannerjee, the ride wasn't easy but a promise had to be kept.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X