తీవ్రవాదంపై మోడీ: ఒబామాతో ఫోన్లో సరదాగా మాట్లాడుతా, కొత్తవాడ్ని

హైదరాబాద్: భారత్ - అమెరికా దేశాల మధ్య పౌర అణు ఒప్పందం చాలా కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. ఒబామాతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఒప్పందం కుదిరిన ఆరు సంవత్సరాలకు మరింత ముందుకు పోవడం సంతోషించదగ్గ విషయమన్నారు.

రక్షణ ప్రాజెక్టుల్లో కూడా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ ఆహ్వానాన్ని మన్నించి భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఒబామాకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సి ఉందన్నారు.

ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడాలని కోరుకున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని, ప్రతి దేశం ఉగ్రవాదాన్ని రూపుమాపాలన్నారు. పరిశుభ్రమైన ఇంధన వనరుల కోసం అమెరికా కృషి చేయాలని కోరారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం కావాలన్నారు.

ఒబామా, ప్రథమ మహిళ మిచెల్లీని భారత్‌కు ఆహ్వానించడం గర్వకారణమన్నారు. ఒబామా ఎంత బిజీగా ఉంటారో తెలుసునని, కానీ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య సంబంధాలు ఎలా మారుతాయో దీని వల్ల తెలుస్తుందన్నారు.

ఈ భాగస్వామ్యంపై మీ కమిట్‌మెంట్‌ను ఇది సూచిస్తోందన్నారు. రెండు దేశాల సంబంధాల విషయంలో ఎప్పుడు ఎలాంటి అనుమానం లేదన్నారు. ప్రస్తుతం డిజిటల్ తరంలో ఇది మరింత దృఢంగా మారిందన్నారు. ఈ భాగస్వామ్యం విజయవంతం కావడం ప్రపంచ శాంతికి చాలా కీలకమన్నారు.

ప్రారంభం బాగానే ఉంది కానీ భాగస్వామ్యం దీనిని విజయవంతం కావడం ప్రపంచ శాంతికి చాలా కీలకమన్నారు. దీనిని విజయవంతమయ్యే దిశలో తీసుకెళ్లాలన్నారు. గడిచిన కొన్ని నెలల్లో బంధంపై కొత్త విశ్వాసం కనిపిస్తోందన్నారు. అణు ఎగుమతి దేశాలలో భారత్ కూడా చేరందుకు తనవంతు సాయం తప్పక చేస్తామన్నారు. రెండు దేశాల్లో ఆర్థికవృద్ధి మరింత బలపడుతోందన్నారు.

ఒబామాతో ప్రత్యేక అనుబంధం

ఒబామాతో తనకు ప్రత్యేక అనుబంధముందని మోడీ అన్నారు. తరుచు ఒబామాతో ఫోన్లో మాట్లాడుతుంటానని, సరదా సంభాషణలు చేస్తామని చెప్పారు. తాను అమెరికా వెళ్లినప్పుడు ఒక బాలీవుడ్ నటుడికి స్వాగతం పలికిన రీతిలో పలికారన్నారు.

తాను ప్రధానిగా కొత్తగా బాధ్యతలు చేపట్టానని, ఈ తక్కువ సమయంలో ఏది చేయాలో ఏది చేయాలో తనకు అవగాహన లేదని, నేతల మధ్య సంబంధాలో పటిష్టతను నిర్ణయిస్తాయన్నారు. కెమెరా ముందు మాట్లాడితే చిన్న చిన్న ఇబ్బందులుంటాయని, వ్యక్తిగతంగా మాట్లాడనప్పుడు భేషజాలు ఉండవన్నారు. మనసు విప్పి మాట్లాడే అవకాశముంటుందన్నారు.

భారత్‌ పర్యటన చాలా ఆహ్లాదకరంగా ఉంది: ఒబామా

భారత్‌ పర్యటన చాలా ఆహ్లాదకరంగా ఉందంటూ ఒబామా అంతకు ముందు అన్నారు. రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ఒబామా నేరుగా రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. భారత్‌ రావడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు.

మహాత్ముని లాంటి నేత ప్రపంచ చరిత్రలోనే లేరని అన్నారు. మహాత్మా గాంధీ ప్రపంచానికే నేత అంటూ విశ్వస్‌ బుక్‌లో ఒబామా రాశారు. భారత్‌లో ఊహించిన దానికి కన్నా ఎక్కువ అతిథ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. నివాళులు అర్పించిన తర్వాత రాజ్‌ఘాట్‌లో ఆయన మొక్కలు నాటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+