నిప్లులు చిమ్ముతూ నింగిలోకి: ఐదు విదేశీ ఉపగ్రహాలు
ఎస్పీఎస్ నెల్లూరు: పీఎస్ఎల్వీసీ 23 సోమవారం ఉదయం 9.52 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకు వెళ్లింది. పీఎస్ఎల్వీసీ ఐదు విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశ పెట్టింది. దీని ద్వారా ఒకేసారి ఐదు విదేశీ ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఆ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ ఆదివారమే షార్ కేంద్రానికి చేరుకున్నారు.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం ఉదయం 9:52కు పిఎస్‌ఎల్‌వి-సి 23 రాకెట్ ప్రయోగం జరిగింది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 8:52కు ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగింది.

స్ట్ఫ్రాన్ మోటార్లు లేకుండా ప్రయోగించే ఈ రాకెట్ ద్వారా ఫ్రాన్సు దేశానికి చెందిన స్పాట్-7 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహంతోపాటు కెనడా, సింగపూర్, జర్మనీ దేశాలకు మరో నాలుగు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌లోని అన్ని దశలకు ఇంధనంతో పాటు హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లను విజయవంతంగా నింపి శాస్తవ్రేత్తలు రాకెట్‌ను ప్రయోగం చేశారు.
నాలుగు దశల్లో జరిగే ప్రయోగం రాకెట్ మొదటి దశలో 138 టన్నుల ఘన ఇంధనం, రెండోదశలో 42 టన్నుల ద్రవ ఇంధనం, మూడోదశలో 7.6 టన్నుల ఘన ఇంధనం, నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనం ఉంటుంది. 44.4 మీటర్ల ఎత్తుగల పిఎస్‌ఎల్‌వి రాకెట్ 230 టన్నుల బరువుకలిగి ఉంటుంది. ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్ శాస్తవ్రేత్తలతో కలసి ప్రయోగ ఏర్పాట్లను సమీక్షించారు. శనివారం రాత్రి ప్రయోగం విజయవంతం కావాలని సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.












Click it and Unblock the Notifications