అన్న భార్య మీద ?, అటవి ప్రాంతంలో ఏం చేశాడంటే ?, వదిన ఒంటరిగా ఉందని, ఎందుకు ?
తమిళనాడులోని పుదుకోట్టై జిల్లా విరాలిమలై సమీపంలో ఓ మహిళను హత్య చేసి బోరుబావి సమీపంలో అటవి ప్రాంతంలో శవం పాతిపెట్టిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు వదినను హత్య చేసిన నిందితుడు ఏమీ తెలినట్లు నాటకాలు ఆడి అడ్డంగా పోలీసులకు చిక్కిపోయాడు. వదిన హత్య కేసుకు గల కారణాలపై పోలీసు అధికారులు ఆరా తీస్తే దిగ్భ్రాంతికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.
తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలోని విరాలిమలై పక్కన ఆవుర్ సమీపంలో అంపూర్‌పట్టి ఉంది. ఈ గ్రామంలో ఆరోగ్యస్వామి అనే ఆయన నివాసం ఉంటున్నారు. ఆరోగ్యస్వామికి 42 ఏళ్ల వయసు ఉన్న జేవియర్, 38 ఏళ్ల రాయప్పన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆరోగ్యస్వామి పేరిట ఉన్న ఆస్తులను అన్నా, తమ్ముడు ఇద్దరూ సమానంగా పంచుకుని తమ పేర్లకు ఆస్తులు బదిలీ చేసుకున్నారు.

జేవియర్ తమ్ముడు రాయప్పన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాయప్పన్ అన్న జేవియర్‌కు 15 ఏళ్ల క్రితం ఆరోగ్య మేరి అలియాస్ మేరీ అనే మహిళతో వివాహమైంది. జేవియర్, మేరీ దంపతులకు పిల్లలు లేరు. అయితే అనారోగ్య కారణాలతో రెండేళ్ల క్రితం జేవియర్ చనిపోయాడు. గత ఏడాది జేవియర్ భార్య ఆరోగ్య మేరి ఆమె భర్త పేరు మీద ఉన్న ఆస్తిని ఆమె పేరు మీదకు బదలాయించింది. అప్పటి నుంచి ఆరోగ్య మేరి, ఆమె మరిది రాయప్పన్‌ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
నీకు పిల్లలు లేరని, నా అన్న జేవియర్ పేరు మీద ఉన్న భూమిని నీ పేరు మీద ఎందుకు మార్చుకున్నావు, నిన్ను చంపేసి ఆ ఆస్తిని తన పేరు మీద బదిలి చేసుకుంటానని రాయప్పన్ తరచూ అతని వదిన మేరీని బెదిరించేవాడని వాళ్ల బంధువులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆరోగ్య మేరి అదృశ్యమైంది. బంధువులు చాలా చోట్ల వెతికినా మేరీ కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న ఉదయం ఆరోగ్య మేరి పొలానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ బావి సమీపంలో ఉన్న విషయం ఓ వ్యక్తి చెప్పడంతో అనుమానం వచ్చిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం ఆ ప్రాంతంలో బావి సమీపంలో పాతపెట్టిన ఆరోగ్య మేరీ మృతదేహం లభ్యమైంది.

అనంతరం పోలీసులు మేరీ మృతదేహాన్ని గుంతలోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. విరాలిమలై పోలీసులు జరిపిన విచారణలో పొంగల్ మరుసటి రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో రాయప్పన్ ఆరోగ్య మేరీని ఆమె పొలంలో కొట్టి చంపి మృతదేహాన్ని అతని ట్రాక్టర్‌లో తీసుకెళ్లాడు. మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టాలా అని ఆలోచించాడు.
చివరికి 100 మీటర్ల దూరంలోని అడవిలో బోరు బావిలో సమీపంలో పాతిపెట్టి, ట్రాక్టర్‌ను ఇంటి వద్ద ఆపి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. పోలీసుల విచారణలో మనపరై ప్రాంతంలో తలదాచుకున్న రాయప్పన్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి కోసమే వదిన మేరీని ఆమె మరిది రాయప్పన్ హత్య చేశాడా ?, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications