బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుణే టెక్కీ హత్య: తల్లి ఛీ కొట్టిందని.. నిందితుడి ఆత్మహత్యాయత్నం

పుణే టెక్కీ ఆనంద్ కె రసిలా రాజు హత్య కేసులో నిందితుడు బాబెన్ సైకియా (27) రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

పుణే: పుణే టెక్కీ ఆనంద్ కె రసిలా రాజు హత్య కేసులో నిందితుడు బాబెన్ సైకియా (27) రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. మహిళా టెక్కీ హత్య కేసులో అతను నిందితుడు కావడాన్ని అతని తల్లి జీర్ణించుకోలేకపోయింది.

దీంతో అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. అతను రెండుసార్లు సూసైడ్ యత్నం చేశాడని తెలుస్తోంది.

తాను ఆమెను చూసినందుకు.. సదరు టెక్కీ తనను తిడుతుందని, గొడవ పడుతుందని ఆయన ఊహించలేదు. ఇప్పుడు, తల్లి కూడా అతని చర్య పట్ల అసహనం వ్యక్తం చేయడంతో అతను తన ప్రాణం తీసుకోవాలనుకున్నాడు.

<strong>ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: ఆ టైంలో పని చేయలేం కానీ.. మహిళా టెక్కీలు </strong>ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: ఆ టైంలో పని చేయలేం కానీ.. మహిళా టెక్కీలు

ఆంగ్ల మీడియాల ోవస్తున్న వార్తల మేరకు.. నిందితుడు బాబెన్ సైకియా పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం పోలీసులు కేసు విషయం ప్రిపేర్ అవుతున్న సమయంలో.. లాకప్‌లో ఉన్న నిందితుడు సైకియా తన తలను ఐరన్ రాడ్డులకు కొట్టుకున్నాడు.

Pune techie’s murder: Infosys to pay Rs 1 crore compensation to victim’s family

తనకు బతకాలని లేదని, చివరకు తన తల్లి కూడా తనతో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని అతను పోలీసులకు చెప్పాడని తెలుస్తోంది. అంతకుముందు రోజు అక్కడకు వచ్చిన తల్లి.. అతను ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాక తన కొడుకు కాదని చెప్పాడు. అతనిని శిక్షించాలని చెప్పారు.

అయితే, జైలులోనే అతను తొలిసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని, అంతకుముందు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

మహిళా టెక్కి చనిపోయిన రోజు నాటి సీసీటీవీని పోలీసులు పరిశీలించారు. అందులో.. ఆమె చనిపోయిన తర్వాత అతను తొమ్మిదో అంతస్తులోని కిటికీ నుంచి దూకేద్దామని భావించాడు. ఇది గుర్తించడం వల్ల కస్టడీలో అతను ఆత్మహత్యాయత్నం చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

English summary
Infosys guard Bhaben Saikiya (27) brutally murdered Rasila OP in her office cubicle because he could not digest the fact that she had dared to rebuke him for staring at her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X