క్షీణించిన సీఎం ఆరోగ్యం.. వైద్యులు ఏం చెప్పారంటే..?
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. గత రెండు రోజులుగా భగవంత్ మాన్ జర్వం, పొత్తికడుపు ఇన్‌ఫెక్షన్ తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. పరిస్థితి సీరియస్ అవడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్టు స్పష్టం చేశారు. అనారోగ్యం కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి పంజాబ్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పర్యటనకు రద్దు అయింది.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. పంజాబ్ లో భారీ వరదల కారణంగా రెండు రోజుల క్రితం వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు బాధిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వేకు బదులుగా ఆయన కాలినడకన ద్వారానే ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. గత రెండు రోజులుగా భగవంత్ మాన్ జర్వం, పొత్తికడుపు ఇన్‌ఫెక్షన్ తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపారు.

అయితే ప్రస్తుతం భగవంత్ మాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వైద్యుల బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని సన్నిహత వర్గాల పేర్కొన్నాయి. అయితే మాన్ ఆరోగ్య పరిస్థితి, ఆయన ఎప్పుడు డిశ్చార్జ్ కావచ్చనే విషయంపై సీఎం కార్యాలయం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు సీఎం ఆరోగ్య కారణాల దృష్ట్యా.. చండీగఢ్ లోని సీఎం అధికారిక నివాసంలో నిర్వహించాలని భావించిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం వాయిదా పడినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications