వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగవంత్ మన్‌కే మెజార్టీ: ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థి, కేజ్రీవాల్ ప్రకటన

|
Google Oneindia TeluguNews

ఊహించిందే జరిగింది. ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థి భగవత్ మాన్‌ ఎంపికయ్యారు. ఈయన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడు.. అయినప్పటికీ ప్రజల కోరిక మేరకు పోల్ నిర్వహించారు. వాట్సాప్ నంబర్ ఇచ్చి, అభిప్రాయం తెలుపాలని కోరారు. మెజార్టీ ప్రజలు మాన్ వైపు ఉన్నారు. ఆయన వైపు మొగ్గు చూపారు. ఈ మేరకు కేజ్రీవాల్.. భగవత్ మన్ సీఎం అభ్యర్థి అని ప్రకటించారు. ఇటు ఫోన్ లైన్ సర్వేలో 93 శాతానికి పైగా ప్రజలు అనుకూలంగా ఉన్నారు.

గతేడాది మాత్రం సిక్ కమ్యూనిటీ నుంచే సీఎం అభ్యర్థి ఉంటారని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. అంతకుముందు ఫోన్ నెంబర్ ఇచ్చి ఒపీనియన్ పోల్ తీసుకున్నారు. జనవరి 17వ తేదీలోగా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని అన్నారు. వేదికపై భగవత్ మన్ పేరు ప్రకటించి కౌగిలించి అభినందించారు. ఆనందంలో కన్నీటి పర్యంతమైన మన్.. వేదికపై ఉన్న పెద్దలు అందరూ అభినందనలు తెలియజేశారు.

Punjab Elections 2022: aap punjab cm candidate is Bhagwant Mann

భగవత్ మాన్ నటుడు.. కమెడీయన్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2014, మార్చిలో ఆప్ పార్టీలో చేరారు. 2014 లో సంగ్రూర్ నియోజక వర్గం నుంచి ఆప్ లోక్ సభ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. 2019 సంగ్రూర్‌లో తిరిగి లోక్ సభ సభ్యుడిగా విజయం సాధించారు. ప్రస్తుతం పంజబ్ ఆప్ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. 2012 లో పీపుల్స్ పార్టీ ఆప్ పంజాజ్ నుంచి లెహర నియోజక వర్గం నుంచి పోటీ చేశారు.

ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి జనవరి 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 28తో నామినేషన్లు ముగియనున్నాయి. జనవరి 30 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను మాత్రం మార్చి 10న వెల్లడిస్తారు. పంజాబ్ పోలింగ్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. మిగతా పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ తెలిపింది.

English summary
Sangrur MP Bhagwant Mann is Aam Aadmi Party's CM candidate. He was named the party's chief ministerial face after more than 93 per cent of respondents voted for him in a phone line survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X