వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IAS Son: ఐఏఎస్ మీద అవినీతి ఆరోపణలు, ఇంట్లో సోదాలు చేస్తుంటే ఐఏఎస్ కొడుకు ఆత్మహత్య !

|
Google Oneindia TeluguNews

పంజాబ్: సీనియర్ ఐఏఎస్ అధికారి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు ఆయన మీద నిఘా వేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అవినీతితో అక్రమంగా ఆస్తులు సంపాధించారని ఆరోపిస్తూ విజిలెన్స్ అధికారులు ఆయన ఇంటిలో సోదాలు చేశారు. ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలోనే మేడ మీ ఉన్న ఐఏఎస్ అధికారి కుమారుడు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Illegal affair: హోటల్ రూమ్ లో భార్య, ప్రియుడిని చూసిన భర్త, రివాల్వర్ తో కాల్పులు, కట్ చేస్తే శవాలు!Illegal affair: హోటల్ రూమ్ లో భార్య, ప్రియుడిని చూసిన భర్త, రివాల్వర్ తో కాల్పులు, కట్ చేస్తే శవాలు!

పంజాబ్ లో సంజయ్ పోప్రీ సీనియర్ ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నారు. చంఢీగఢ్ సెక్టార్ 11లో ఐఏఎస్ అధికారి సంజయ్ పోప్రీ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఐఏఎస్ అధికారి సంజయ్ పోప్రీకి కార్తీక్ పోప్రీ అలియాస్ కార్తీక్ (26) అనే కుమారుడు ఉన్నాడు.

Punjab IAS Sanjay Popli son killed shot in the head, mother has accused Punjab Vigilance team of firing son, cops say suicide.

సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ పోప్రీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో పంజాబ్ విజిలెన్స్ అధికారులు చంఢీగఢ్ లోని సెక్టార్ 11లోని ఆయన ఇంటిలో సోదాలు చేశారు. చాలా కాలంగా సంజయ్ పోప్రీ మీద అధికారులు నిఘా వేశారని సమాచారం. సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ పోప్రీ అవినీతితో అక్రమంగా ఆస్తులు సంపాధించారని ఆరోపిస్తూ విజిలెన్స్ అధికారులు ఆయన ఇంటిలో సోదాలు చేస్తున్న సమయంలో ఆయన భార్య, కుమారుడు కార్తీక్ ఇంట్లోనే ఉన్నారు.

Shiv Sena: ఏక్ నాథ్ మీద వేటువేసిన సీఎం ఠాక్రే, షిండే స్థానంలో చౌధరి, స్పీకర్ గ్రీన్ సిగ్నల్ !Shiv Sena: ఏక్ నాథ్ మీద వేటువేసిన సీఎం ఠాక్రే, షిండే స్థానంలో చౌధరి, స్పీకర్ గ్రీన్ సిగ్నల్ !

కింద విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తుంటే మేడ మీద ఉన్న కార్తీక్ రివాల్వర్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడు కార్తీక్ ను పంజాబ్ పోలీసులు కాల్చి చంపేశారని అతని తల్లి పత్రిజ్ఞా చంఢీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు కారణంగా కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టారని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. ఐఏఎస్ అధికారి సంజయ్ పోప్రీని విజిలెన్స్ అధికారులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడా ?, అసలు ఏం జరిగింది ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

English summary
Punjab IAS Sanjay Popli son killed shot in the head, mother has accused Punjab Vigilance team of firing son, cops say suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X