పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ దారుణ హత్య..
పంజాబ్ సింగర్ సిద్దూ మూసె వాలాపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సిద్దూపై కాల్పులు జరిపారు. మన్సా జిల్లాలో గల జవహర్కె గ్రామంలో ఆదివారం సిద్దూపై ఫైర్ జరిగింది. పంజాబ్ పోలీసులు 424 మందికి భద్రతా విత్ డ్రా చేశారు. ఆ మరునాడే సిద్దూపై అటాక్ చేశారు. మాన్సా నుంచి సిద్దూ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. అయితే ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లాపై 63 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే విజయ్.. ఇటీవల సీఎం భగవంత్ మాన్‌పై అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో సిద్దూ ఆప్‌ను టార్గెట్ చేశారు. స్కాం అని కామెంట్ చేశారు.
తీవ్రంగా గాయపడిన శుభదీప్ సింగ్ ను హుటాహుటీన మాన్సా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు గాయపడగా, వారికి ప్రాథమిక చికిత్స అనంతరం, మరో ఆస్పత్రికి తరలించారు. శుభదీప్ సింగ్ తన థార్ వాహనంలో స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళుతుండగా కాల్పులు జరిగాయి.

సిద్దూ వయసు 28 ఏళ్లు.. ఇటీవల పంజాబ్ ప్రభుత్వం 424 మందికి పోలీసు భద్రతను తొలగించింది. వారిలో ఆయన కూడా ఉన్నారు. భద్రత తొలగించిన కొన్నిరోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. త్వరలో సీఎం భగవంత్ మాన్ కలిసి తన భద్రత పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని శుభదీప్ విజ్ఞప్తి చేయాలనుకున్నట్టు తెలుస్తోంది. అంతలోనే ఘోరం జరిగిపోయింది.
సిద్దూ మృతిపై కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. అతని మృతి దిగ్బ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా అన్నారు. పంజాబ్ ప్రజలు.. ఓ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌ను కోల్పోయారు. అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. బీజేపీ నేతలు పంజాబ్ సీఎం మాన్‌ను తప్పుపట్టారు. భద్రత ఎందుకు విరమించారని అడిగారు.












Click it and Unblock the Notifications