కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు-కేజ్రివాల్ కొత్త డిమాండ్-టార్గెట్ బీజేపీ !
గుజరాత్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ దేశంలో రాజకీయాలు కూడా అదే బాటలో సాగుతున్నాయి. మరోవైపు రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే రోజూ పతనం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఇవాళ ప్రధాని మోడీకి ఓ సూచన చేశారు.
దేశంలో ప్రస్తుతం ముద్రిస్తున్న కరెన్సీ నోట్లపై గణేష్, లక్ష్మీదేవి ఫొటోలు ఉండేలా చూడాలని అరవింద్ కేజ్రివాల్ ప్రధాని మోడీకి సూచించారు. దేశంలో పతనమవుతున్న రూపాయి విలువను కాపాడేందుకు ఈ చర్య అవసరమని ఆయన ప్రధానికి సూచించారు. దీంతో కేజ్రివాల్ డిమాండ్ సంచలనం రేపుతోంది. ఇప్పటివరకూ బీజేపీ మత రాజకీయాల్ని విమర్శిస్తున్న కేజ్రివాల్... ఒక్కసారిగా కరెన్సీ నోట్లపై హిందూ దేవతల ఫోటోల్ని ముద్రించాలని కోరడం వెనుక ఏముందనే చర్చ జరుగుతోంది.

అయితే కేజ్రివాల్ డిమాండ్ ఉద్దేశం మాత్రం త్వరలో జరిగే గుజరాత్, హర్యానా ఎన్నికలే అని తెలుస్తోంది. గుజరాత్, హర్యానాతో పాటు హిమాచల్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో హిందూత్వ అజెండాతో ముందుకెళ్తున్న బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే కేజ్రివాల్ ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. తద్వారా బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టాలని కేజ్రివాల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేజ్రివాల్ డిమాండ్ పై దేశంలో అప్పుడే విమర్శలు కూడా మెదలయ్యాయి.ఉన్నత విద్యావంతుడైన కేజ్రివాల్ బీజేపీ నేతల తరహాలో ఇలాంటి డిమాండ్ చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications