వారసత్వ సంపదగా విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ పూర్వీకుల ఇల్లు
కోల్‌కత్తా: ఉత్తర కోల్‌కత్తాలోని జొరాసాంకోలో ఉన్న నోబుల్ అవార్డు గ్రహీత, విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిని వారసత్వ సంపదగా సంరక్షించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "ఇదొక వారసత్వ నిర్మాణం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా ఆ ఇంటిని చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. అందుకే దాన్ని రాష్ట్ర వారసత్వ సంపదగా చేయాలని నిర్ణయించాం" అని ఆమె మీడియాకు వివరించారు.

కాగా, ఈ ఇంటిలో ఉన్న రవీంద్రభారతి విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను రాజహత్ న్యూ టౌన్ ప్రాంతానికి మార్చనున్నట్టు మమతా చెప్పారు. అక్కడ పదెకరాల స్థలాన్ని విశ్వవిద్యాలయ అథారిటీకి ఇస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications