రాహుల్ ఆరోపణలు తోసిపుచ్చిన ఈసీ-మరిన్ని ఆధారాలతో విపక్ష నేత ట్వీట్..!
కర్నాటకలోని అలంద్ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6018 ఓట్లు అక్రమ మార్గాల్లో తొలగించారని ఆరోపిస్తూ ఇవాళ విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వీటిపై స్పందించిన ఈసీ.. రాహుల్ ఆరోపణల్లో పస లేదని ట్వీట్ చేసింది. వీటికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేసింది. అసలు ఓటరుకు తెలియకుండా ఓట్ల తొలగింపు జరగదని కూడా ఈసీ తెలిపింది. దీనిపై రాహుల్ స్పందించారు.
కర్నాటకలో ఓట్ల తొలగింపు జరిగిన విధానంపై ఇవాళ ఉదయం ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ... అందులో కర్నాటక సీఐడీ వీటిపై విచారణ జరిపి సీఈసీ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అయితే దీనిపై ట్వీట్ చేసిన ఈసీ.. రాహుల్ ఆరోపణలు నిరాధారమని తేల్చేసింది. 2023లో అలంద్ లో ఓట్ల తొలగింపు ప్రయత్నాలు జరిగాయని, వీటిపై తామే స్వయంగా విచారణ జరుపుతున్నట్లు ప్రకటించింది.

దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. అలంద్ లో ఓట్ల తొలగింపుపై 18 నెలల్లో సీఈసీకి కర్నాటక సీఐడీ 18 లేఖలు రాస్తే పట్టించుకోలేదని రాహుల్ ఆరోపించారు. విచారణకు సహకరించాలని సీఈసీకి కర్నాటక ఈసీ లేఖలు రాసినా మౌనంగా ఉండిపోయిందన్నారు. ఓట్ల చోరీ చేసిన కంప్యూటర్ల ఐపీ అడ్రస్ లు, డివైజ్ పోర్టులు, ఓటీపీ ప్రయత్నాలపై ఆధారాలు ఇచ్చినా ఈసీ పట్టించుకోలేదన్నారు.

After our Aland candidate exposed the fraud, the local EC official filed an FIR, but the CID investigation has been - BLOCKED by CEC.
— Rahul Gandhi (@RahulGandhi) September 18, 2025
The Karnataka CID has written 18 letters in 18 months requesting all incriminating evidence - BLOCKED by CEC.
The Karnataka EC has sent multiple… https://t.co/l6vOv2nNga
ఈ ఓట్ల దొంగతనం పట్టుబడి ఉండకపోతే మరియు 6,018 ఓట్లను తొలగించి ఉండకపోతే, తమ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయేవారని రాహుల్ గాంధీ తెలిపారు. కాబట్టి సీఈసీ జ్ఞానేష్ కుమార్ సాకులు చెప్పడం ఆపాలని కోరారు. ఆధారాలను ఇప్పుడే కర్ణాటక సీఐడీకి విడుదల చేయాలని ఆయనకు సూచించారు. తామే స్వయంగా ఓట్ల తొలగింపుపై విచారణ చేస్తున్నట్లు ఈసీ చెప్పిన నేపథ్యంలో రాహుల్ చేసిన సవాల్ ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications