500 కిలోల పూలు: ఫ్యామిలీతో రాహుల్ నామినేషన్

భారీ ఊరేగింపుతో నామినేషన్ వేసేందుకు రాహుల్ గాంధీ వచ్చారు. కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో రాహుల్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీపై పూలవర్షం కురిపించేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు 500 కిలోల పూలను తీసుకువచ్చారు. కలెక్టరేట్ వరకు సాగిన రాహుల్ ర్యాలీలో ఆయనపై వారు పూల వర్షం కురిపించారు.
కాగా, అమేథీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీకి ఈసారి మరో ఇద్దరు అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. అయితే అమేథీలో కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టు ఉండటంతో గత మూడు ఎన్నికల్లోనూ ఆ పార్టీకే పట్టారు ఇక్కడి ప్రజలు. 2009 ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3.5 లక్షల మెజార్టీ ఓట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కోసం ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు.
ఈ ఎన్నికల్లో అమేథి నుంచి భారతీయ జనతా పార్టీ తరపున సినీ నటి, రాజ్యసభ సభ్యురాలు స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కవి కుమార్ విశ్వాస్ బరిలో ఉన్నారు. ఇప్పటికే స్మృతీ ఇరానీ, కుమార్ విశ్వాస్ అమేథిలో రాహుల్ చేసిన అభివృద్ధిపై సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ అమేథి నియోజక వర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications