భారత ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని రాహుల్ గాంధీ దెబ్బతీస్తోన్నారా?

Rahul Gandhi: లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భారత ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోన్నారా?.. విభజనవాదానికి నాంది పలుకుతున్నారా?.. అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తోన్న ప్రకటనలు, వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో భారత ఆర్మీ గురించి వ్యాఖ్యలు చేశారు. దేశసమగ్రతను ప్రశ్నించారు. దేశ అంతర్గత, విదేశీ శక్తుల ముప్పు నుండి దేశాన్ని రక్షించడానికి అవిశ్రాంతంగా పనిచేసే నైతిక మద్దతు, సంఘీభావాన్ని తెలియజేయడానికి బదులుగా.. రాజకీయాల కోసం వినియోగించుకుంటోన్నారనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి.

Rahul Gandhi has repeatedly demoralize the India s armed forces and security agencies

పాకిస్తాన్‌తో జరిగిన సైనిక చర్య, యుద్ద సమయంలో అమెరికా ఒత్తిడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరెండర్ అయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించడాన్ని దీనికి ఉదహరిస్తోన్నారు. భోపాల్‌లో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ తర్వాత ప్రధాని మోదీ లొంగిపోయారని వ్యాఖ్యానించారు.

నరేంద్రా, లొంగిపో' అని ట్రంప్ ఆదేశించగా.. దానికి ఓకే సర్ అని మోదీ బదులిచ్చారని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. దీనిపై కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో విస్తృత ప్రచారం చేసింది. ట్రంప్ ఫోన్‌లో నరేంద్రా, లొంగిపో అని మోదీ ఆదేశిస్తున్నట్లు, సరే సర్ అని మోదీ సమాధానం ఇస్తున్నట్లు ఓ కార్టూన్‌ను సైతం కాంగ్రెస్ పోస్ట్ చేసింది.

అత్యంత సమస్యాత్మక, సున్నిత సమయాల్లో రాహుల్ గాంధీ.. భారత ఆర్మీ సమగ్రతను ప్రశ్నించడం వివాదాస్పదమైంది. ఇది ఆయనకు మొదటిసారేమీ కాదు. గతంలో బాలకోట్ వైమానిక దాడులు, యూరీ సర్జికల్ దాడులపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. సాయుధ బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వీడియో ప్రూఫ్ డిమాండ్ చేశారు.

గాల్వాన్ వ్యాలీలో భారత్- చైనా ఆర్మీ మధ్య ఘర్షణ సమయంలో కూడా రాహుల్ గాంధీ ఇలాంటి వ్యతిరేక వ్యాఖ్యలే చేశారనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. సైనికుల త్యాగాలను గౌరవించడానికి బదులుగా ఆయన రాజకీయం చేయడానికి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి వీటిని వినియోగించుకుంటోన్నాడని ఆరోపణలు వినిపించాయి.

పదే పదే భారత్ వైపు నుంచి సంభవించిన ప్రాణనష్టాలను రాహుల్ గాంధీ ప్రశ్నిస్తోండటం, పాకిస్తాన్ భారీ నష్టాల గురించి ప్రస్తావించకపోవడం పరిశీలకులను విస్మయానికి గురి చేస్తోంది. భారత్ జరిపిన ఎదురుదాడి- పాకిస్తాన్ లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను దెబ్బతీశాయనేది.. తటస్థులు కూడా అంగీకరించడం అనేది వాస్తవం

అయినప్పటికీ- రాహుల్ గాంధీ తన సొంత ప్రయోజనాల కోసం భారత ఆర్మీ గురించి పదే పదే ప్రశ్నిస్తోండటం కాంగ్రెస్ రాజకీయం.. జాతీయతను సైతం అధిగమించినట్టయిందని అంటున్నారు. యుద్ధాన్ని ఎదుర్కొంటోన్న దేశాల్లో రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమౌతాయి. సైన్యానికి అండగా నిలుస్తాయి.

రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం విషయంలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ అక్కడి పార్టీన్నీ ఏకాభిప్రాయాన్ని ప్రకటించాయి. కాంగ్రెస్ గానీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ గానీ దేశ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయాలని కోరుకుంటోన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాహుల్ గాంధీ వైఖరి వల్ల భారత ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయడమే కాకుండా శత్రువులకు మరింత ధైర్యాన్ని ఇస్తుందనే ఆందోళన వ్యక్తమౌతోంది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడంలో నిరంతరం వెనక్కి తగ్గట్లేదు. ప్రతిపక్షాలు కూడా ఆయా సందర్భానికి తగ్గట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+