గాంధీ-నెహ్రూల్ని మోసం చేశాడు-బ్రిటిషర్లకు సావర్కర్ లేఖ బయటపెట్టిన రాహుల్ గాంధీ..
భారత స్వాతంత్ర సంగ్రామంలో బీజేపీ పాత్ర కానీ, దాని మాతృసంస్ధ జన్ సంఘ్ పాత్ర కానీ లేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంటుంది. అలాగే భారత స్వాతంత్రోద్యమంలో జన్ సంఘ్ నేతలు బ్రిటీషర్లపై పోరాడాల్సింది పోయి సహకరించారని కూడా విమర్శలు చేస్తుంటుంది. దీన్ని నిరూపించే ఓ లేఖను ఇవాళ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బయటపెట్టారు.
Veer Savarkar, in a letter written to the British, said "Sir, I beg to remain your most obedient servant" & signed on it. Savarkar helped the British. He betrayed leaders like Mahatma Gandhi, Jawaharlal Nehru & Sardar Patel by signing the letter out of fear: Cong MP Rahul Gandhi pic.twitter.com/PcmtW6AD24
— ANI (@ANI) November 17, 2022
బీజేపీ అభిమాన నేత వీర్ సావర్కర్ భారత్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో బ్రిటీషర్లతో ఎలా వ్యవహరించాడన్న దాన్ని బయటపెట్టేలా ఉన్న ఓ లేఖను రాహుల్ గాంధీ ఇవాళ బయటపెట్టారు. ఈ లేఖను సావర్కర్ స్వయంగా బ్రిటీషర్లకు రాశాడు. ఈ లేఖలో సావర్కర్ చేసిన వ్యాఖ్యలు భారత్ కు వ్యతిరేకంగా ఉన్నాయని, ముఖ్యంగా అప్పట్లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు గాంధీ, నెహ్రూ, పటేల్ ను మోసం చేసేలా ఉన్నాయని రాహుల్ తెలిపారు.

భారత స్వాతంత్ర సంగ్రామం సాగుతున్న సమయంలో వీర్ సావర్కర్, బ్రిటీష్ వారికి రాసిన లేఖలో, "సర్, నేను మీకు అత్యంత విధేయుడైన సేవకుడిగా ఉంటానని వేడుకుంటున్నా" అని ఉంది. అలాగే దానిపై ఆయన సంతకం కూడా ఉంది. సావర్కర్ బ్రిటిష్ వారికి సహాయం చేశాడు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి నాయకులకు భయంతో లేఖపై సంతకం చేసి మోసం చేశాడని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications