ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఊహించని షాక్ ఇచ్చిన రాహుల్ గాంధీ!

భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ రోజు సమీపిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చారు. జాతీయ జెండాను ఉంచారు. హర్ ఘర్ తిరంగా ఉత్సవంలో భాగంగా తన డీపీని మార్చానని, మీరు కూడా మార్చాలంటూ ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపును కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వీకరించారు. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ప్రొఫైల్ చిత్రాన్ని మారుస్తూ మోడీకి షాక్ ఇచ్చారు.

త్రివర్ణ పతాకం మన దేశానికే గర్వకారణమని, ప్రతి భారతీయుడి గుండెల్లో ఇది ఉంటుదని రాహుల్ అన్నారు. తన ప్రొఫైల్ చిత్రంగా జవహర్ లాల్ నెహ్రూ జాతీయ జెండాను పట్టుకున్న చిత్రాన్ని డీపీగా ఉంచారు. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదే చిత్రాన్ని ప్రొఫైల్ చిత్రంగా ఉంచడంతోపాటు తమ దేశభక్తిని చాటుతూనే తమ రాజకీయ ప్రత్యర్థికి కౌంటర్ ఇచ్చారు.

rahul gandhi shock to prime minister narendra modi

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న వేళ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకను ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ చిత్రాలుగా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కోరారు. అలాగే ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలను ఎగరవేయాలని మోడీ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+