Sabarimala: శబరిమలపై మాట్లాడరే ? మోడీకి రాహుల్ సూటి ప్రశ్న..!

కేరళలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారంలోనూ మాటల వేడి పెరుగుతోంది. కేరళలో ఈసారి అధికార ఎల్టీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీ (rahul gandhi) ఇవాళ ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. ముఖ్యంగా అన్ని విషయాలు మాట్లాడుతున్న ప్రధాని మోడీ.. శబరిమలలో జరిగిన చోరీపై ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్ ప్రశ్నించారు.

హిందూమత పరిరక్షకుడని చెప్పుకునే ప్రధాని కేరళకు వచ్చినప్పుడు శబరిమల గురించి ఏమీ మాట్లాడరని కన్నూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్రంలో సీఎం పినరయి విజయన్‌కు ఎలా మద్దతు ఇస్తోందని రాహుల్ ప్రశ్నించారు. ముందుగా ప్రధాని ఎక్కడికి వెళ్లినా దేవాలయాలు, మతం, దేవుళ్ల గురించే మాట్లాడతారు. కానీ ప్రధాని కేరళకు వచ్చినప్పుడు, ఆయన శబరిమల ఆలయం విషయాన్ని ప్రస్తావించరని రాహుల్ ఆక్షేపించారు.

Rahul Gandhi Slams PM s Silence on Sabarimala in Kerala So-Called Defender of Hinduism

సీపీఎం నాయకులు శబరిమల ఆలయం నుంచి బంగారం దొంగిలించారు, కానీ వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. హిందూమత పరిరక్షకుడని చెప్పుకునే ఆయన కేరళకు వచ్చి శబరిమల గురించి ఏమీ మాట్లాడరు అంటూ ప్రధాని మోడీకి రాహుల్ చురకలు అంటించారు. రాష్ట్రంలో ఈసారి ఎవరు గెలిచినా స్వల్ప తేడాయే ఉంటుందని సర్వేలు చెప్తుండటంతో రాహుల్ గాంధీ.. ఈ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకుని కేరళలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+