Rahul Gandhi : మణిపూర్ లో భారతమాతను చంపేశారు-కేంద్రంపై నిప్పులు చెరిగిన రాహుల్
మణిపూర్ అంశంపై లోక్ సభలో జరుగుతున్న అవిశ్వాస తీర్మాన చర్చలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ కీలక ప్రసంగం చేశారు. ఇందులో తాను గతంలో చేసిన భారత్ జోడో యాత్ర లక్ష్యాన్ని వివరించారు. దేశ ప్రజల్ని కలిపేందుకు తాను చేస్తున్న ప్రసంగాల్ని ఏకరువు పెట్టారు. తాను అసలు యాత్ర చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా వివరించారు. రాహుల్ ప్రసంగానికి అడ్డుతగిలేందుకు బీజేపీ ఎంపీలు ప్రయత్నించారు. దీంతో వారిపై రాహుల్ మధ్యలో సెటైర్లు కూడా వేశారు.

తాను ఇవాళ నా మనసుతో మాట్లాడాలనుకుంటున్నానంటూ రాహుల్ ప్రసంగం ప్రారంభించారు. ఎప్పటిలాగా ఈరోజు ప్రభుత్వంపై తీవ్ర దాడి చేయనని కూడా చెప్పారు. మీరు భారత్ జోడో యాత్ర ఎందుకు ప్రారంభించారని ప్రజలు నన్ను అడిగేవారని, యాత్ర ఎందుకు ప్రారంభించానో కూడా తనకు తెలియదని రాహుల్ అన్నారు. దేశాన్ని అర్థం చేసుకునేందుకే యాత్ర ప్రారంభించానని గ్రహించానన్నారు. 10 ఏళ్లుగా తనను ఎందుకు దుర్భాషలాడారో కూడా అర్థం చేసుకోవాలని భావించినట్లు రాహుల్ తెలిపారు.
దేశం యొక్క వాణిని వినడానికి, మనం అహంకారాన్ని, ద్వేషాన్ని విడిచిపెట్టాలని రాహుల్ కోరారు. మన ప్రధాని హింసాత్మక మణిపూర్‌ను సందర్శించలేదని, ఆయనకు సంబంధించినంత వరకూ మణిపూర్ భారతదేశంలో భాగం కాదన్నారు.మణిపూర్ రెండుగా చీలిపోయిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ లో భారతమాతను చంపేశారంటూ రాహుల్ మండిపడ్డారు. మీరు దేశభక్తులు కాదు దేశద్రోహులంటూ మోడీ సర్కార్ పై రాహుల్ నిప్పులు చెరిగారు. దీంతో అధికార బీజేపీ ఎంపీలు పదే పదే రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
మణిపూర్ కు సైన్యాన్ని ఎందుకు పంపడం లేదని రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. మణిపూర్ కు సైన్యాన్ని పంపితే ఒక్క రోజులో పరిస్దితిలు చక్కబడతాయని పేర్కొన్నారు. అసలు మోడీ మణిపూర్ కు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. మోడీ దృష్టిలో మణిపూర్ భారత్ లో భాగం కాదా అని రాహుల్ ప్రశ్నించారు. ఇండియా మా ప్రజల గొంతుకని రాహుల్ తెలిపారు. మణిపూర్‌లో మీరు ఆ గొంతును చంపారన్నారు.
మీరు మణిపూర్‌లో భారత మాతను చంపారన్నారు. మీరు మణిపూర్ ప్రజలను చంపారని, భారతదేశాన్నే చంపారన్నారు. మీరు దేశద్రోహులన్నారు. మీరు దేశభక్తులు కాదన్నారు. నా అమ్మలలో ఒకరు ఇక్కడ కూర్చున్నారని, మీరు మణిపూర్‌లో నా మరొక తల్లిని చంపారన్నారు. ప్రధాని మోదీ భారత్ మాట వినడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications