Viral Video: చెరువులోకి దూకి చేపలు పట్టిన రాహుల్ గాంధీ..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ మరో అరుదైన ఫీట్ చేసారు. బీహార్ ఎన్నికల ప్రచారం కోసం బెగూసరాయ్ వచ్చిన రాహుల్ గాంధీ.. స్థానికంగా ఉన్న మత్సకారుల్ని కలిశారు. వారి కష్టాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మహాకూటమిలో మిత్రపక్షం వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ అధినేత ముకేష్ సాహ్నీతో కలిసి ఏకంగా చెరువులోకి దూకేశారు. స్వయంగా చేపలు కూడా పట్టారు. దీంతో మత్సకారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
తూర్పు తీరంలో లెనిన్ గ్రాడ్ గా చెప్పుకునే బెగూసరాయ్ ప్రాంతంలో ఇవాళ ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీకి వీఐపీ నేత ముకేష్ సాహ్నీ జత కలిశారు. వీరిద్దరూ స్థానికంగా ఉన్న మత్సకారుల్ని కలిశారు. ఓట్లు అడగడం కంటే వారి మద్దతు పొందేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ పడవలో నీటిలోకి వెళ్లి అమాంతం దూకేశారు. ఆ తర్వాత వారితో కలిసి కాసేపు వలతో చేపలు కూడా పట్టారు.

నడుం కంటే ఎక్కువ లోతున్న నీటిలో దిగి రాహుల్ గాంధీ తమ వలలు తీసుకుని చేపలు పడుతుంటే మత్సకారులు షాకయ్యారు. రాహుల్ గాంధీ వంటి నేత ఇలా నేరుగా నీటిలోకి దిగిపోయి తమతో కలిసి చేపలు పట్టడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. మహాకూటమి ఈసారి ఎన్నికల మ్యానిఫెస్టోలో మత్సకారులకు వేట నిషేధం ఉన్న సమయంలో నెలకు 5 వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే వారికి ఇన్సూరెన్స్ సాయం కూడా అందిస్తామని తెలిపింది. దీంతో మత్సకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Jan Nayak Rahul Gandhi ji 🔥🎯 pic.twitter.com/GuYyiIrA3X
— Hakimuddin Saify (@HakimSaifyINC) November 2, 2025
బీహార్‌లోని బెగుసరాయ్‌లో మత్స్యకార సంఘాన్ని ఇవాళ వీఐపీ పార్టీ అధ్యక్షుడు ముఖేష్ సాహ్నితో కలవడం చాలా సంతోషంగా ఉందని అనంతరం రాహుల్ ట్వీట్ చేశారు. వారి పని కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని, దానితో ముడిపడి ఉన్న సమస్యలు , పోరాటాలు తీవ్రమైనవని తెలిపారు. వారి కృషి, అభిరుచి, ప్రతి పరిస్థితిలోనూ వ్యాపారం పట్ల లోతైన అవగాహన స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. బీహార్‌లోని నదులు, కాలువలు, చెరువులు, వాటిలో నివసించే మత్స్యకారులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగమన్నారు. వారి హక్కులు, గౌరవం కోసం ప్రతి అడుగులోనూ వారితో నిలబడతానన్నారు.












Click it and Unblock the Notifications