వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్వేష బుల్డోజర్లను ఆపి విద్యుత్ ప్లాంట్లు తెరవండి-మోడీకి రాహుల్ చురకలు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలోని జహంగీర్ పురిలో మతఘర్షణలకు కారకులుగా భావిస్తున్న వారి ఇళ్లపైకి కార్పోరేషన్ బుల్డోజర్లు పంపడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. మధ్యప్రదేశ్ లోనూ అక్కడి బీజేపీ సర్కార్ ఇదే తీరు కొనసాగిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ ఇవాళ ప్రధాని మోడీని టార్గెట్ చేశారు.

ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లోని హింసాత్మక ప్రాంతాల్లో బుల్‌డోజర్ల వినియోగంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విద్వేష బుల్ డోజర్లను ఆపి, నిలిచిపోయిన విద్యుత్ ప్లాంట్లను తిరిగి తెరవాలని ఆయన ప్రధాని మోడీకి సూచించారు. దేశంలో బొగ్గు కొరత సమస్యను ప్రస్తావిస్తూ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకోవడంతో దేశంలో విద్యుత్ కోతలు పెరుగుతున్నాయని రాహుల్ ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా ప్రధాని మోడీ ఎన్నో పెద్దమాటలు మాట్లాడారని, కానీ ఇప్పుడు 8 రోజుల బొగ్గు నిల్వలు మాత్రమే దేశంలో ఉన్నాయని రాహుల్ ఎద్దేవా చేశారు.

"మోదీ జీ, సంక్షోభం పొంచి ఉంది. విద్యుత్ కోతలు చిన్న పరిశ్రమలను మూసేసేలా ఉన్నాయి. ఇది మరిన్ని ఉద్యోగాలని మింగేసేలా కనిపిస్తోంది. అని రాహుల్ గాంధీ ట్వీట్లో మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాబట్టి విద్వేష బుల్డోజర్లను స్విచ్ ఆఫ్ చేయండి, పవర్ ప్లాంట్లను ఆన్ చేయండి అని కోరారు. ఢిల్లీలో హింస చోటు చేసుకున్న జహంగీర్‌పురి, మధ్యప్రదేశ్‌లో బిజెపి ఆరోపిస్తున్న అల్లర్లకు వ్యతిరేకంగా ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్‌లో బుల్‌డోజర్‌లను ఉపయోగించడాన్ని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Rahul Gandhi targets pm modi over usage of bulldozers against muslims in delhi and mp

మరోవైపు భారతదేశంలో కేవలం 8 రోజుల బొగ్గు నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయని, బిజెపి విద్వేషపూరిత రాజకీయాల కారణంగా వీధుల్లో మండుతున్న మంటలు ఇళ్లను వెలిగించవు అని కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొంది.

English summary
congress leader rahul gandhi on today slams pm modi on use of buldozers in delhi and madhya pradesh against muslims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X