తిరిగి కాంగ్రెస్ ఛీఫ్ గా రాహుల్ ? సీడబ్ల్యూసీలో డిమాండ్లు-తప్పకుండా పరిశీలిస్తానని వెల్లడి
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నిర్వహణపై ఇవాళ జరిగిన పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో వాడీవేడిగా వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం అధినేత్రి సోనియాగాంధీ ప్రస్తుతానికి పూర్తి స్ధాయి అధ్యక్షురాలినని, వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహిద్దామని తేల్చేశారు. అయితే ఇదే సమయంలో జోక్యం చేసుకన్న రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరగాల్సిన సంస్ధాగత ఎన్నికలపై ఇవాళ చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు చేపట్టాలని పలువురు సీడబ్ల్యూసీ సభ్యులు సూచించారు. అయితే దీనిపై స్పందించిన రాహుల్.. తాను తప్పుకుండా పరిశీలిస్తానని వారికి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తానని నేతలకు రాహుల్ హామీ ఇచ్చారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో ఆ పదవిపై ఆశలు పెట్టుకన్న అసంతృప్త నేతలకు మంట పుట్టిస్తున్నాయి.

ఇవాళ జరిగిన సీడబ్లూసీ భేటిలో రాహుల్ గాంధీని తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేప్టటాలని పంజాబ్, రాజస్ధాన్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రులతో పాటు సీనియర్ నేత ఏకే ఆంటోనీ కూడా కోరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో అప్పటి నుంచి అధ్యక్ష పదవిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇదే అదనుగా పార్టీలో సీనియర్లు రెచ్చిపోతున్నారు. దీంతో వారిని నియంత్రించేందుకు పార్టీ అధినేత్రి సోనియగాంధీ ఎఫ్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తిరిగి రాహుల్ పార్టీ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయిస్తే మాత్రం కచ్చితంగా సీనియర్ల నుంచి ప్రతిఘటన తప్పకపోవచ్చని తెలుస్తోంది. అయినా ఓసారి రాహుల్ నిర్ణయం తీసుకుంటే అధినేత్రి సోనియాతో పాటు ఇతర కీలక నేతల నుంచి మద్దతు లభించే అవకాశాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి.