వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ కాపీ ముందే ఎలా అందింది?; నిజమేంటో ప్రజలకు తెలుసన్న రాహుల్..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జస్టిస్ బ్రిజ్‌మోహన్ హరికిషన్ లోయా మరణంపై స్వతంత్ర దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కొట్టివేసిన నేపథ్యంలో.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ ట్వీట్ ద్వారా స్పందించారు. అందులో అమిత్ షాపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

rahul

'భారతీయులు చాలా తెలివైనవాళ్లు. బీజేపీలో ఉన్నవాళ్లతొ సహా, చాలామంది భారతీయులు అమిత్ షాకు సంబంధించిన నిజాలను అర్థం చేసుకోగలరు. అలాంటివాళ్లను పట్టుకోవడానికి సత్యానికి తనదైన మార్గం ఉంది' అని రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా, 2014లో మరణించిన జస్టిస్ లోయా అనుమానస్పద మరణంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టును కొందరు ఆశ్రయించారు. అయితే లోయాది సహజమరణమేనని కోర్టు విశ్వసిస్తోందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొంటూ స్వతంత్ర దర్యాప్తు కోరుతూ వేసిన పిటిషన్లను కొట్టివేశారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిథి రణదీప్ సుర్జీవాలా సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు భారతదేశ చరిత్రలో శోక దినాన్ని మిగిల్చిందన్నారు. తీర్పులో చాలా ప్రశ్నలకు సమాధానాలే లేవన్నారు.

ఇదిలా ఉంటే, సుప్రీం కోర్టు తీర్పుకు సంబంధించిన జడ్జిమెంట్ కాపీ ముందే న్యాయశాఖ మంత్రి రవిప్రసాద్ వద్ద ప్రత్యక్షమవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసులో ప్రధాన పిటిషన్ దారు అయిన తనకు కాపీ అందకముందే రవిశంకర్ ప్రసాద్ కు జడ్జిమెంట్ కాపీ ఎక్కడినుంచి వచ్చిందని తెహసీన్ పూనవాలా ప్రశ్నించారు.

మీడియాకు అందలేదు.. పబ్లిక్ గా విడుదల కాలేదు.. అయినా జడ్జిమెంట్ కాపీ రవిశంకర్ ప్రసాద్ కు ఎక్కడినుంచి వచ్చిందని సుర్జీవాలా నిలదీశారు. పైగా సుప్రీంకోర్టు వెబ్ సైట్ కూడా హ్యాక్ అయి ఉందని, అలాంటప్పుడు.. ఆ కాపీ ఆయనకు ఎక్కడినుంచి వచ్చి ఉంటుందని ప్రశ్నించారు.

జస్టిస్ లోయా మృతిపై స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీం నో, అనుమానాల్లేవన్న కోర్టుజస్టిస్ లోయా మృతిపై స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీం నో, అనుమానాల్లేవన్న కోర్టు

English summary
The Congress Party on Thursday questioned how the Union Law Minister Ravi Shankar Prasad got the copy of the judgment in Judge Loya's death case when the Supreme Court website was hacked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X