video: భారీ వర్షాలతో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాంగ్రా జిల్లాలోని చక్కి వంతెన.. భారీ వర్షపాతం కారణంగా మూడు స్తంభాలలో ఒకటి పూర్తిగా దెబ్బతినడంతో శనివారం కూలిపోయింది. చక్కి నదిపై నిర్మించిన రైల్వే వంతెనలో కొంత భాగం కుప్పకూలిపోయింది.
ధర్మశాలలో శనివారం కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రాష్ట్రంలోని మండి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు ప్రవేశించింది. తీవ్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో రహదారిపై నిలిపి ఉన్న వాహనాలు ధ్వంసం అయ్యాయి. జిల్లాలోని బాల్, సదర్, తునాగ్, మండి, లమథాచ్‌లలో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కాంగ్రా, కులు, మండి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
#BREAKING:#News #Monsoon2022#Railway Bridge Collapses Amid Heavy Rainfall In Himachal's #Kangra#BreakingNews #Monsoon #HeavyRains #flood #Floods #Alert #RainAlert #RainSafety #keepsafety #Emergency pic.twitter.com/nWTfC9oqO9
— Ketan Sojitra🇮🇳 (@Mrketansojitra) August 20, 2022
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా, చంబా, బిలాస్‌పూర్, సిర్మౌర్, మండి జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
ప్రతికూల వాతావరణంలో నదులు, వాగుల దగ్గరకు వెళ్లవద్దని స్థానికులు, పర్యాటకులను ప్రభుత్వం హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు 25 వరకు భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications