అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ

"భారత్ గౌరవ్" పేరుతో భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన థీమ్-ఆధారిత సర్క్యూట్ రైళ్లు దక్షిణ మధ్య రైల్వే అంతటా భారీ విజయాన్ని సాధించాయి. దక్షిణ మధ్య రైల్వేలో "భారత్ గౌరవ్" రైళ్లు ప్రయాణికుల నుండి భారీ స్పందనను పొందిందని చెప్పడానికి ఇప్పటివరకు నడిపిన అన్నీ ట్రిప్ ల నుండి మంచి స్పందన రావడమే ఒక నిదర్శనం. ఇప్పటివరకు ప్రయాణికుల నుండి వచ్చిన గణనీయమైన స్పందనను స్పూర్తిగా తీసుకొని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, (ఐఆర్ సీటిసీ) తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో బోర్డింగ్ / డి బోర్డింగ్ స్టేషన్లతో తెలంగాణ రాష్ట్రం నుండి మరొక "భారత్ గౌరవ్" టూరిస్ట్ సర్క్యూట్ రైలు యాత్రను చేపట్టింది.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు ఈరోజు అనగా , అక్టోబర్ 21 , 2024న ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ "శబరిమల యాత్ర " భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు బ్రోచర్‌ను విడుదల చేసినారు. ఈ సంధర్భంగా ఐఆర్ సీటిసీ గ్రూప్ జనరల్ మేనేజర్ శ్రీ పి. రాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లకు ప్రయాణికుల నుండి మంచి స్పందన లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఆధ్యాత్మిక టూరిజం వృద్ధికి భారత్ గౌరవ్ రైళ్లు పెద్దపీట వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రైలు వినియోగదారులు శబరిమల ఆలయం మరియు ఇతర అనుసంధానిత యాత్రా స్థలాలను సందర్శించే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Railway department has run a special train for Sabarimala pilgrims

ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభంకానున్న ఐఆర్ సీటిసీ"భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు " శబరిమల యాత్ర" పేరుతో నూతన పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది . ఈ రైలు శబరిమలలోని ప్రసిద్ధ అయ్యప్పస్వామి ఆలయం, మరియు చొట్టనిక్కరలోని చొట్టనిక్కర దేవి ఆలయంను దర్శింపజేస్తుంది . తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని నల్గొండ , పిడుగురాళ్ల గుంటూరు, తెనాలి , ఒంగోలు , నెల్లూరు, గూడూరు , రేణిగుంట , తిరుపతి మరియు చిత్తూరులో పది ముఖ్యమైన మార్గ మధ్య స్టేషన్లలో బోర్డింగ్ / డి-బోర్డింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది .

ఈ యాత్ర మొత్తం ట్రిప్ 04 రాత్రులు / 05 రోజుల వ్యవధిలో కవర్ చేయబడుతుంది. ఇందులో అన్ని ప్రయాణ సౌకర్యాలు (రైలు మరియు రోడ్డు రవాణాతో సహా), వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం, లంచ్ మరియు డిన్నర్ - ఆన్-బోర్డు మరియు ఆఫ్-బోర్డ్ రెండూ), రైలులో భద్రత (సిసిటీవి కెమెరాలు అన్ని కోచ్‌లలో అమర్చబడ్డాయి) పబ్లిక్ అనౌన్స్మెంట్ సౌకర్యం మరియు ప్రయాణ భీమా సౌకర్యాలు కల్పించబడ్డాయి మరియు ప్రయాణం అంతటా వృత్తిపరమైన మరియు స్నేహపూర్వక ఐఆర్ సీటిసీ టూర్ మేనేజర్‌ల సేవలు అందుబాటులో ఉంటాయి.

Railway department has run a special train for Sabarimala pilgrims

"శబరిమల యాత్ర"- భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు
పర్యటన వివరాలు:శబరిమల , అయ్యప్ప స్వామి స్వామి ఆలయం
చొట్టనిక్కర , చొట్టనిక్కర భగవతి ఆలయం
పర్యటన తేదీ:16.11.2024 ఉదయం 08.00 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది.
వ్యవధి 04 రాత్రులు/05 రోజులు
16.11.2024 నుండి 20.11.2024 వరకు
బోర్డింగ్ / డి బోర్డింగ్ స్టేషన్లు :సికింద్రాబాద్ , నల్గొండ , పిడుగురాళ్ల , గుంటూరు, తెనాలి , ఒంగోలు , నెల్లూరు, గూడూరు , రేణిగుంట , తిరుపతి , చిత్తూరు
ఒక్కొక్కరికి ధర (జి. ఎస్. టి తో సహా) ఎకానమీ కేటగిరీ (స్లీపర్)): రూ . 11,475/-
ప్రామాణిక వర్గం (3 ఏసీ):): రూ . 18,790/-
కంఫర్ట్ కేటగిరీ (2 ఏసీ): రూ . 24,215/-

గమ్యస్థానాలు మరియు స్థలాలు
శబరిమల : అయ్యప్ప స్వామి దేవాలయం
చొట్టనిక్కర : చొట్టనిక్కర భగవతి ఆలయం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+