Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pamban Bridge: ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం-కొత్త పంబన్ బ్రిడ్జ్ పిక్స్ షేర్ చేసిన రైల్వేమంత్రి..!

తమిళనాడు సముద్ర తీరంలో ఉన్న చారిత్రక పంబన్ బ్రిడ్జి శిధిలావస్ధకు చేరడంతో దాని స్ధానంలో మరో కొత్త పంబన్ బ్రిడ్జిని అదే పేరుతో తాజాగా నిర్మించారు. గతంలో ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే పంబన్ బ్రిడ్జిని ఇప్పటికే లక్షల మంది పర్యాటకులు సందర్శించారు. ఈ బ్రిడ్జిపై నుంచి వెళ్లే రైల్లో సముద్రంపై ప్రయాణిస్తూ ఎంతో ఆస్వాదించారు. ఇప్పుడు దాని స్ధానంలో కొత్త హంగులతో తయారైన కొత్త పంబన్ బ్రిడ్జి కూడా ఎంతో ఆకట్టుకుంటోంది. దీని ఫొటోల్ని రైల్వే మంత్రి షేర్ చేశారు.

కొత్త పంబన్ బ్రిడ్జి ఫొటోల్ని ఇవాళ ఎక్స్ లో షేర్ చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీన్ని ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణించారు. త్త పాంబన్ వంతెన కేవలం క్రియాత్మకమైనది కాదని, ఇది ఆధునిక ఇంజినీరింగ్‌తో ప్రజలను మరియు ప్రదేశాలను అనుసంధానించే పురోగతికి చిహ్నమన్నారు. వర్టికల్ లిఫ్ట్ విధానంలో భారత్ లో నిర్మించిన తొలి రైల్వే బ్రిడ్జి ఇదే. దీని రాకతో 105 ఏళ్ల చరిత్ర కలిగిన పంబన్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోనున్నాయి. సముద్రం మధ్యలో నిర్మించిన ఈ వంతెన మధ్యలో భారీ ఓడల వచ్చినప్పుడు తెరుచుకునేలా ప్రత్యేక గేట్లు ఉంటాయి. గతంలో ఉన్న పంబన్ బ్రిడ్జికి కూడా ఈ ఫీచర్ ఉంది.

railway minister Ashwini vishnaw shares modern engineering marvel new pamban bridge pics

ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొత్త పంబన్ వంతెనను "ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం"గా అభివర్ణిస్తూనే.. ఈ ప్రాజెక్ట్ "ముఖ్యమైన అప్‌గ్రేడ్ అని, వేగం, భద్రత, ఆవిష్కరణల కోసం రూపొందించబడిందని తెలిపారు. అలాగే ఈ బ్రిడ్జి రాత్రి పూట ఫొటోను కూడా మరో పోస్టులో రైల్వే మంత్రి షేర్ చేశారు. ఇందులో కొత్త పంబన్ వంతెన భారత ప్రధాన భూభాగాన్ని తమిళనాడులోని రామేశ్వరం ద్వీపానికి కలుపుతుందని తెలిపారు. ఈ ఫొటోలో రాత్రిపూట ఈ బ్రిడ్జికి సమీపంలో ఓడలు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+