తప్పుడు ప్రచారం చేయొద్దు, రైల్వే దరఖాస్తు ఫీజును పెంచలేదు: పీయూష్‌

న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగ నియామక పరీక్షలకు ఫీజును పెంచలేదని ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గతంలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, తదితర కొన్ని వర్గాల అభ్యర్థులకు ఉచితంగా పరీక్షలకు అనుమతించేవారు. అలానే, జనరల్ కేటగిరి అభ్యర్థుల నుంచి రూ.100 వసూలు చేసేవారు.

ఈ క్రమంలో ఫీజు లేకపోవడంతో చాలా మంది కేవలం దరఖాస్తు చేసి కనీసం పరీక్షకు కూడా హాజరు కావడం లేదని తాము గుర్తించామని, కాలక్షేపం కోసం కాకుండా వాస్తవంగా ఉద్యోగం కోరుకునువారే దరఖాస్తు చేసేలా చర్యలు తీసుకున్నామని గోయల్ చెప్పారు.

Railway recruitment examination fee to be refunded: Piyush Goyal

ఇందులో భాగంగానే గతంలో ఫీజు మినహాయింపు ఉన్న వర్గాల అభ్యర్థుల నుంచి ఈసారి రూ.250, జనరల్ అభ్యర్థుల నుంచి రూ.500 ఫీజు తొలుత వసూలు చేయాలని తాము నిర్ణయించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

పరీక్షకు హాజరైన వారిలోని మినహాయింపు ఉన్న వర్గాలకు వారు కట్టిన మొత్తం ఫీజును, జనరల్ అభ్యర్థులకు రూ.400ను వెనక్కి ఇస్తామని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అందు వల్ల ఇది ఫీజు పెంపు కిందకు రాదని, తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+