Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహా కుంభమేళా సమయంలో రైల్వే శాఖ కీలక అలెర్ట్.. ఆ రైళ్ళు రద్దు!

దేశవ్యాప్తంగా ప్రజలంతా మహా కుంభమేళాకు వెళుతున్న వేళ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి మహా కుంభమేళా ప్రయాణికులకు సౌకర్యాలను కల్పిస్తున్న భారతీయ రైల్వే తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తర భారతదేశం అంతటా దట్టమైన పొగ మంచు వ్యాపించిన కారణంగా మార్చి 2025 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది.

ఆ మార్గాలలో రైళ్ళు రద్దు చేసిన రైల్వే
పొగ మంచు కారణంగా రైల్వే రూట్ లలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తున్న క్రమంలోనే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే ప్రకటించింది. శీతాకాలం కావడంతో దట్టమైన పొగ మంచు ఉత్తర భారతదేశం అంతటా వ్యాపించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తుంది విజిబిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల భద్రతాపరమైన సమస్యలను ఉటంకించిన రైల్వే మార్చి 2025 వరకు అనేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Railways issues key alert during Maha Kumbh Mela some trains are cancelled due to fog

రద్దు చేసిన రైళ్ళు ఇవే
ఇక రద్దు చేయబడిన రైళ్ల జాబితా వివరాల్లోకి వెళితే...ట్రైన్ నంబర్ .. 14617-14618 : బన్మంఖి-అమృతసర్ జనసేవ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 13 నుండి మార్చి 2, 2025 వరకు రద్దు చేయబడింది. అలాగే ట్రైన్ నంబర్.. 14606-14605 : యోగనగరి రిషికేశ్-జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 13 నుండి ఫిబ్రవరి 24, 2025 వరకు రద్దు చేస్తున్నట్టు రైల్వే ప్రకటించింది.

ఈ మార్గాలలో రైళ్ళు రద్దు
రైలు నెంబర్. 14616-14615 : అమృత్‌సర్-లాల్కువాన్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ జనవరి 13 నుండి మార్చి 22, 2025 వరకు ఆ మార్గంలో నడవబోదని ప్రకటించింది. రైలు నెంబర్. 14524-14523 : అంబాలా-బరౌని హరిహర్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 13 నుండి ఫిబ్రవరి 27 వరకు రద్దు చేయబడింది. రైలు నం. 18103-18104 : జలియన్‌వాలా బాగ్ ఎక్స్‌ప్రెస్ జనవరి 13 నుండి ఫిబ్రవరి 28, 2025 రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

రద్దయిన రైళ్ళ వివరాలు ఇవే
రైలు నెంబర్ . 12210- 12209 : కత్గోడం-కాన్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ జనవరి 13 నుండి ఫిబ్రవరి 25, 2025 వరకు రద్దు చేశారు. రైలు నెం. 14003-14004 : మాల్దా టౌన్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ జనవరి 13 నుండి మార్చి 1, 2025 వరకు రద్దు చేయబడింది.

ప్రయాణికుల అసంతృప్తి
ఇక రైల్వే రైళ్ళను రద్దు చేయటంతో ఎప్పుడో ఈ రైళ్ళలో ప్రయాణాలు చేయటం కోసం రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ప్లాన్ చేసుకుని టికెట్స్ రిజర్వేషన్ చేసుకున్న వారు రైల్వే తాజా నిర్ణయంతో తమ ప్లాన్ మార్చుకోవాల్సి వస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+