జోధ్‌పూర్‌లో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం
జోధ్‌పూర్: రాజస్థాన్‌లో జోధ్‌పూర్‌లో శనివారం మధ్యాహ్నం 3.21 గంటలకు భూకంపం సంభవించింది. ఈ తీవ్రత రిక్టార్ స్కేలుపై 4.2గా నమోదైంది. అయితే ప్రాణనష్టం కానీ, అస్తినష్టం కానీ జరిగినట్టు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.

జోధ్‌పూర్‌తో పాటు రాజస్థాన్‌లో నాగౌర్, అజ్మీర్, పాలి సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఆందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
ఇది ఇలా ఉండగా, శనివారం ఉదయం అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో జనం అంతా రోడ్లపైకి పరుగులు తీశారు. ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు జరగలేదు.












Click it and Unblock the Notifications