రాజధాని ఎక్స్‌ప్రెస్ పరుగుకు 55ఏళ్ళు, రైల్వేశాఖ ముద్దుగా పిలిచే "బంగారుపాప" ప్రత్యేకతలివే!!

రైల్వేశాఖ ముద్దుగా పిలిచే బంగారుపాప రాజధాని ఎక్స్‌ప్రెస్ పరుగు నేడు 55వ వసంతంలోకి ఆగుపెట్టింది. భారతీయ రైల్వేలో అగ్రశ్రేణి రైలుగా ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు తెలుసుకోవాల్సిందే.

రైల్వే శాఖలో రాజధాని ఎక్స్‌ప్రెస్ కి ఉండే ప్రత్యేకత అంతా ఇంతా కాదు. భారత రైల్వేలో రైళ్లు ఎన్ని ఉన్నా రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతే వేరు. రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు ఎక్కి పరుగు ప్రారంభించి 54 వసంతాలను పూర్తిచేసుకుని 55 వసంతంలోకి అడుగు పెట్టిన సమయంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

భారతదేశ అగ్రశ్రేణి రైళ్ళలో ఒకటిగా రాజధాని ఎక్స్‌ప్రెస్

భారతదేశ అగ్రశ్రేణి రైళ్ళలో ఒకటిగా రాజధాని ఎక్స్‌ప్రెస్


రాజధాని ఎక్స్‌ప్రెస్ .. భారతదేశంలో ఉన్న అగ్రశ్రేణి రైళ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ఢిల్లీ మరియు ఇతర రాష్ట్ర రాజధానుల మధ్య నడుస్తుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ కు ఆ పేరు పెట్టడం వెనుక ప్రధాన కారణం ఇది రాజధాని నగరాల మధ్య నడిచే రైలు కావడమే. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 140 కిలోమీటర్లు. చక్కని ఎయిర్ కండీషన్ ఉన్న తొలి రైలుగా దీనికి ప్రత్యేకత ఉంది. 1969 మార్చి ఒకటవ తేదీన మొట్టమొదటి రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభించబడింది.

దేశంలో తొలి ఎయిర్ కండిషన్ ఉన్న రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్

దేశంలో తొలి ఎయిర్ కండిషన్ ఉన్న రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్

మొదటి ఢిల్లీ నుండి హౌరా వరకు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దీనిని ప్రారంభించారు. దీని సగటు వేగం 130 కిలోమీటర్లు కాగా, గంటకు 140 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రాజధాని దూసుకుపోతుంది. ఈ తొలి ఎయిర్ కండిషన్ ఉన్న రైలు వల్ల రోజు ప్రయాణంలో 17 గంటల సమయం తగ్గిందని సమాచారం. దేశంలోని మొదటి రాజధాని ఎక్స్‌ప్రెస్ ను దేశానికే గర్వకారణంగా రైల్వే శాఖ చెబుతుంది. ఎందుకంటే ఈ రైలు కేవలం వేగానికి మాత్రమే కాకుండా భద్రతకు సౌకర్యాలకు కూడా మొదటి స్థానంలో పరిగణించబడుతుంది.

రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత ఇదే

రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత ఇదే


రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రయాణం చేస్తున్న మార్గాలలో అవసరమైతే వేరే రైళ్లను కాసేపు ఆపే అవకాశం ఉంటుంది కానీ, రాజధాని ఎక్స్‌ప్రెస్ ను మాత్రం ఎప్పుడు లైన్ క్లియర్ చేసి సమయాభావం లేకుండా రన్ చేస్తారు. ఇక తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును పెరంబదూరులోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. దీని తయారీ ఖర్చు అప్పట్లో 65 లక్షలు కాగా, దీని స్టాప్ లు కేవలం మూడు మాత్రమే ఉండేవి. ఇక ప్రారంభం నాడు టికెట్ ధర చైర్ కార్ కు 90 రూపాయలు, స్లీపర్ క్లాస్ కు 290 రూపాయలుగా ఉండేది.

రైల్వే శాఖ బంగారు పాప రాజధాని ఎక్స్‌ప్రెస్

రైల్వే శాఖ బంగారు పాప రాజధాని ఎక్స్‌ప్రెస్


9 కోచ్ లతో, డీజిల్ లోకోమోటివ్ ఇంజన్ తో రాజధాని ఎక్స్‌ప్రెస్ రూపొందించబడింది. నాటి రైల్వే శాఖ మంత్రి రామ్ శుభాగ్ సింగ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించారు. ఇక 54 వసంతాలు పూర్తిచేసుకుని 55వ వసంతంలోకి అడుగు పెట్టిన రాజధాని ఎక్స్‌ప్రెస్ ను దేశంలోని రైల్వే వ్యవస్థకే గర్వ కారణం కావటంతో రైల్వే శాఖ దీనికి బంగారు పాప అని పేరు పెట్టి ముద్దుగా పిలుచుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+