జయని ఢీకొట్టాలంటే బీజేపీకి రజనీకాంతే దిక్కు! విజయకాంత్...

చెన్నై: సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రాలలో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ తమిళనాడులో మాత్రం అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను, డీఎంకే చీఫ్ కరుణానిధిలను ఎదుర్కొనే బలం, బలగం చేకూరలేదా అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో జయ, కరుణలను గట్టిగా ఢీకొనాలంటే బీజేపీకి సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కరే ప్రత్యామ్నాయంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తమిళనాడులో పర్యటించారు. ఈ సమయంలో పెద్దగా బీజేపీకి కలిసి వచ్చిందేమీ లేదంటున్నారు. ముగ్గురు పార్టీలో చేరడం మినహాయించి ఏమీ లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాజీ డీఎంకే ఎంపీ, ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి నెపోలియన్ బీజేపీలో చేరారు. ప్రముఖ సంగీత దర్శకులు గంగాయ్ అమరన్, స్మాల్ టైమ్ నటి, కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్ కూడా బీజేపీలో చేరారు.

కొంతలో కొంత నెపోలియన్ మినహా మిగిలిన ఇద్దరికీ అంత మాస్ బేస్ లేదని అంటున్నారు. వారి చేరిక వల్ల బీజేపీకి కొత్తగా వచ్చేదేమీ లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి రజనీకాంత్ ఒక్కరే ప్రత్యామ్నాయమని, కానీ ఆయన రాజకీయాల వైపు చూసే అవకాశం లేనందున, వచ్చే తమిళనాడు అసెంబ్లీ నాటికి బీజేపీ ఆశిస్తున్నట్లుగా ఆ పార్టీ అన్నాడీఎంకే, డీఎంకేలకు ధీటుగా ఎదిగే పరిస్థితి కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

అమిత్ షా

అమిత్ షా

సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రాలలో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ తమిళనాడులో మాత్రం అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను, డీఎంకే చీఫ్ కరుణానిధిలను ఎదుర్కొనే బలం, బలగం చేకూరలేదా అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రజనీకాంత్

రజనీకాంత్

తమిళనాడులో జయ, కరుణలను గట్టిగా ఢీకొనాలంటే బీజేపీకి సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కరే ప్రత్యామ్నాయంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

జయ, కరుణ

జయ, కరుణ

బీజేపీకి రజనీకాంత్ ఒక్కరే ప్రత్యామ్నాయమని, కానీ ఆయన రాజకీయాల వైపు చూసే అవకాశం లేనందున, వచ్చే తమిళనాడు అసెంబ్లీ నాటికి బీజేపీ ఆశిస్తున్నట్లుగా ఆ పార్టీ అన్నాడీఎంకే, డీఎంకేలకు ధీటుగా ఎదిగే పరిస్థితి కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

నెపోలియన్

నెపోలియన్

మాజీ డీఎంకే ఎంపీ, ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి నెపోలియన్ ఇటీవల బీజేపీలో చేరారు. అమిత్ షా సమక్షంలో ఆయన కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

గాయత్రీ రఘురామ్

గాయత్రీ రఘురామ్

ప్రముఖ సంగీత దర్శకులు అమరన్, స్మాల్ టైమ్ నటి, కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్ కూడా బీజేపీలో చేరారు. ఇటీవల బీజేపీలో చేరారు. అమిత్ షా సమక్షంలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

విజయకాంత్

విజయకాంత్

మరో విషయమేమంటే.. తనను కలవాలని అమిత్ షా తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు బీజేపీ మిత్రపక్షమైన డీఎండీకే చీఫ్ విజయకాంత్‌కు సమాచారం ఇచ్చినప్పటికీ కలవలేదట. మరోవైపు, వీహెచ్‌పీ కన్వర్సేషన్స్‌ను మరో మిత్రపక్షం పీఎంకే వ్యతిరేకిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+