వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడగలేదు: రాజీవ్ గాంధీపై బాంబు పేల్చిన నట్వర్ సింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajiv Gandhi didn't consul even his cabinet on IPKF: Natwar
న్యూఢిల్లీ: శ్రీలంకకు శాంతి బలగాల తరలింపు పైన నాటి ప్రధాని రాజీవ్ గాంధీ కేబినెట్ నిర్ణయాన్ని తీసుకోలేదట. రాజీవ్ అధికారులను అడగలేదని, కేబినెట్‌ మంత్రులకు మాటమాత్రమైనా చెప్పలేదని, శ్రీలంకలో ఎల్టీటీఈపై పోరాడేందుకు భారత సైన్యాన్ని పంపించాలని ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుని, ఆదేశాలు జారీ చేశారని నట్వర్‌ సింగ్‌ పేర్కొన్నారు. ‘వన్‌ లైఫ్‌ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌' పేరిట పుస్తకం రాసిన ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే.

ఆయన తాజాగా మరో బాంబు పేల్చారు! 1987లో కొలంబోలో నాటి శ్రీలంక అధ్యక్షుడు జయవర్ధనే ఇచ్చిన విందుకు రాజీవ్‌ హాజరయ్యారని, తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, సైన్యాన్ని పంపించాలని జయవర్ధనే కోరారని, ఇందుకు రాజీవ్‌ వెంటనే అంగీకరించారని, అధికారులు, మంత్రివర్గ సహచరుల సూచనలు, ఆమోదం తీసుకోకుండానే రాజీవ్‌ ఆదేశాలిచ్చారని నట్వర్‌ చెప్పారు. అప్పట్లో తాను, పీవీ శ్రీలంకలోనే ఉన్నామన్నారు.

ఈ విషయం తమకు తెలిసేటప్పటికే శ్రీలంకకు భారత సైన్యాన్ని పంపాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. నాడు తమిళ టైగర్ల ఆధీనంలోని జాఫ్నాలో విమానాల్లోంచి ఆహార పొట్లాలు జారవిడవడం పైనా రాజీవ్‌ ఆషామాషీగా నిర్ణయం తీసుకున్నారన్నారు. శ్రీలంక ప్రభుత్వంతోపాటు ఐరాసలోని మన రాయబారికి సమాచారం ఇచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అలా చేయకపోతే శ్రీలంక గగనతలంపై దాడికి దిగినట్టయ్యేందన్నారు.

అప్పట్లో భద్రతామండలిలో సభ్యదేశంగా ఉన్న శ్రీలంక ఈ అంశంపై రచ్చ చేసేదే అన్నారు. దీనిపై తాను ముందుగా హెచ్చరించడంతో ఈ ప్రమాదం తప్పిందన్నారు. ప్రభాకరన్‌ను రాజీవ్‌ గుడ్డిగా నమ్మేశారన్నారు. ప్రభాకరన్‌ను కలిసి వచ్చాక... ఆయా అంశాలపై ఎల్టీటీఈ చీఫ్‌ నుంచి లిఖితపూర్వక హామీలు తీసుకున్నారా? అని రాజీవ్‌ను తాను అడిగానని, దీంతో రాజీవ్‌ కస్సుమన్నారన్నారు. ప్రభాకరన్‌ మాట ఇచ్చారని తెలిపారు. కానీ... భారత ప్రధాని సహా అనేకమందికి ఇచ్చిన మాటను ప్రభాకరన్‌ తప్పారన్నారు.

English summary

 Estranged Gandhi family loyalist Natwar Singh has claimed that Rajiv Gandhi had sent troops to Sri Lanka without consulting his cabinet and the island nation's ethnic issue was mishandled in a manner that led to the assassination of the former PM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X