రంగంలోకి ఆర్ఎస్ఎస్.. రాజ్‌నాథ్‌కు పెరిగిన ప్రాధాన్యం
ఢిల్లీ : కేబినెట్ కమిటీల ఏర్పాటులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ప్రాధాన్యం తగ్గించి తప్పటడుగు వేసింది. హోం మంత్రి అమిత్ షాకు ఎనిమిది, నిర్మలా సీతారామన్‌కు 7, పీయూష్ గోయెల్‌కు 5 కమిటీల్లో స్థానం కట్టబెట్టిన ప్రభుత్వం.. పార్టీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్‌ను రెండు కమిటీలకే పరిమితం చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెలువెత్తడం, ఆర్ఎస్ఎస్ ఆగ్రహంతో తప్పు దిద్దుకుంది.
గురువారం ప్రకటించిన కేబినెట్ కమిటీల్లో బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్‌కు కీలక కమిటీల్లో స్థానం కల్పించకపోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. మోడీ నిర్ణయంతో మనస్తాపానికి గురైన రాజ్‌నాథ్ ఒక దశలో రాజీనామాకు సిద్ధమయ్యారన్న వార్తలు వచ్చాయి. పరిస్థితి చేయిదాటుతోందని గ్రహంచిన ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది. రాజ్‌నాథ్‌ను పక్కన బెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో తప్పు దిద్దుకున్న మోడీ సర్కారు ఆయనకు మరో నాలుగు కమిటీల్లో సభ్యుడిగా నియమించింది. భద్రత, రాజకీయ వ్యవహారాలతో పాటు ఆర్థిక, పార్లమెంటరీ, అభివృద్ధి పెట్టుబడులు, ఉపాధి నైపుణ్యాభివృద్ధి కేబినెట్ కమిటీల్లో రాజ్‌నాథ్‌కు చోటు కల్పించింది.గురువారం నాటి పరిణామాలు కేంద్రంలో రాజ్‌నాథ్ ప్రాధాన్యం క్రమేపీ తగ్గుతోందనడానికి నిదర్శనంగా నిలిచింది.
మరోవైపు కమిటీల కూర్పులో హోం మంత్రి అమిత్ షా ప్రాధాన్యం అమాంతం పెరిగిపోయింది. కీలక నిర్ణయాలు తీసుకునే అన్ని కమిటీల్లోనూ ఆయనకు ప్రిఫరెన్స్ ఇవ్వడంతో పాటు నీతి ఆయోగ్‌లో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా నియమించారు. ప్రధాని సభ్యుడిగా లేని రెండు కమిటీల్లోనూ అమిత్ షా మెంబర్‌గా ఉండటం విశేషం.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications