చైనాకు రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్-భారత్ కు హాని చేయాలని చూస్తే ఎవర్నీ వదిలిపెట్టం...
భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కాస్త శాంతించినా గతంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్ధితులు ప్రభావం మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగాభారత్ లో రాజకీయ నేతలపై ఈ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇవాళ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తున్న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అక్కడి నుంచే చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
భారత్ కు హాని చేయాలని చూస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని చైనాకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పరోక్ష హెచ్చరికలు చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌లో ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో రక్షణ మంత్రి మాట్లాడారు. చైనా సరిహద్దులో భారత సైనికులు చూపుతున్న ధైర్యసాహసాలను ఆయన ప్రస్తావించారు. భారత సైనికులు ఏం చేశారో, మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో బహిరంగంగా చెప్పలేను.అయితే భారత్‌కు హాని కలిగితే మాత్రం ఎవరినీ విడిచిపెట్టదని సందేశం వెళ్లిందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలనన్నారు.

2020 మే నెలలో పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత భారత్, చైనా సైన్యాల మధ్య లడఖ్ సరిహద్దు ప్రతిష్టంభన మొదలైంది. జూన్ 15, 2020న గాల్వాన్ లోయలో ఇరు సేనలు ఘర్షణ పడిన తర్వాత ప్రతిష్టంభన తీవ్రమైంది, ఫలితంగా 20 మంది భారతీయ సైనికులు, ఓ అజ్ఞాత సైనికుడు చనిపోయారు. తూర్పు లడఖ్ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్, చైనా ఇప్పటివరకు 15 రౌండ్ల సైనిక చర్చలు నిర్వహించాయి, దీని కారణంగా గత సంవత్సరం పాంగోంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డునృ, గోగ్రా ప్రాంతంలో ఇరుపక్షాలు బలగాల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టాయి.
శాన్ ఫ్రాన్సిస్కోలో భారతీయ-అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం శక్తివంతమైన దేశంగా ఉద్భవించిందని, ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదుగుతుందని గర్వంగా చెప్పారు.












Click it and Unblock the Notifications