జయ ఆరోగ్యం: సీబీఐతో దర్యాప్తు చేయించండి: శశికళ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత ఆరోగ్యం గురించి, ఆమె మీద వస్తున్నపుకార్లపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పా డిమాండ్ చేశారు.
సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జయలలిత ఆరోగ్య విషయాలను తమిళనాడు ప్రభుత్వం ఎందుకు రహస్యంగా దాచిపెడుతుందని ప్రశ్నించారు. జయలలిత ఆరోగ్యం విషయంలో రోజుకోక పుకారు పుట్టుకు వస్తుందని అన్నారు.
తమిళనాడు ప్రజలకు నిజానిజాలు తెలియాలంటే ఈ విషయంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పా డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే నాయకుల మీద ఇదే సమయంలో ఆమె మండిపడ్డారు.

అన్నాడీఎంకే ఎంపీని ఢిల్లీ ఎయిర్ పోర్టులో చెంపదెబ్బ కొట్టిన శశికళ పుష్పా అమ్మ ఆగ్రహానికి గురైనారు. సాటి ఎంపీకి క్షమాపణలు చెప్పి వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చెయ్యాలని జయలలిత ఆదేశాలు జారీ చేశారు.
అయితే తాను ఏతప్పు చెయ్యలేదని, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని శశికళ పుష్పా తేల్చి చెప్పారు. అమ్మను ఎదిరించిన శశికళ పుష్పాను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు.
అప్పటి నుంచి అమ్మ పైన పదేపదే ఆరోపణలు చేస్తున్న శశికళ పుష్పా ఒక్క సారిగా జయ ఆరోగ్యం విషయంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చెయ్యడంతో రాజకీయయ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications