భారత్ లో మరో కొత్త ఎయిర్ లైన్-ఆకాసా ప్రారంభం-గడ్డుకాలంలో రాకేష్ ఝన్ ఝన్ వాలా సాహసం
భారత్ లో విమానయాన రంగం కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రయాణికులు విమానయానానికి దూరమై చాలా కాలమైంది. కరోనా కష్టాలతో మరింత ఎక్కువైన విమానయాన రంగం ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం పలు చర్యలు తీసుకుంటున్నా అవి ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఎయిర్ ఇండియా వంటి సంస్ధనే టాటాలకు కేంద్రం తిరిగి అమ్మేసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో మరో కొత్త విమానయాన సంస్ధ ప్రారంభమైంది.
దేశంలో కొత్తగా ఆకాశా పేరుతో విమానయాన సంస్ధను పారిశ్రామికవేత్త రాకేష్ ఝన్ ఝన్ వాలా ప్రారంభించారు. ముంబైలో ప్రారంభమైన ఈ విమానయాన సంస్ధ అహ్మదాబాద్ కు తొలి విమానాన్ని నడిపింది. ఇకపై దేశ, విదేశాలకు రెగ్యులర్ విమానాల్ని నడపాలని ఆకాసా నిర్ణయించింది. దీంతో ఇప్పుడు ఉన్న ఇతర విమానయాన సంస్ధలకు పోటీగా ఆకాసా ఏం చేయబోతోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నిన్న ముంబై నుండి అహ్మదాబాద్‌కు మా తొలి విమానంతో వాణిజ్య కార్యకలాపాలను విజయవంతంగా ప్రారంభించడం అకాసా ఎయిర్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని సీఈవో వినయ్ దూబే తెలిపారు. ఇది ఈ రోజును సాధ్యం చేసిన వారికే కాదు, భారత్ యొక్క ఆర్ధిక పునరుత్ఖానం, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన రంగ ప్రగతికి నిదర్శనమన్నారు. ఆదివారం నుంచి అకాసా ఎయిర్ ముంబై, అహ్మదాబాద్ మధ్య వారానికో విమానాలను నడుపుతోంది. క్రమంగా తన నెట్‌వర్క్‌కు నగరాలు, మార్గాలను జోడిస్తూ ముంబై, అహ్మదాబాద్, కొచ్చి, బెంగళూరు, చెన్నైతో సహా ఐదు నగరాలతో పాటు మొత్తం ఐదు మార్గాలను ఎయిర్‌లైన్ ఇప్పటికే ప్రకటించింది.












Click it and Unblock the Notifications