సరైన టైమ్ లో తెరపైకొచ్చిన రామ్ మాధవ్..!!
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్.. వార్తల్లోకెక్కారు. తెరపైకి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలన, బీజేపీతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గల సంబంధాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అలవికాని టారిఫ్, పాకిస్తాన్ వైఖరి.. వంటి పలు అంశాలపై మాట్లాడారు.
తాజాగా ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రస్తావించడాన్ని స్వాగతించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశంసించడం సంతోషాన్ని కలిగించిందని, కొంతమందికి మాత్రం ఇది నచ్చలేదని వ్యాఖ్యానించారు. అందుకే.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య సత్సంబంధాలు లేవనే ప్రచారం చేస్తోన్నారని చెప్పారు.

ఈ ఏడాది అక్టోబర్‌లో 100 సంవత్సరంలోకి అడుగుపెడుతుంది ఆర్ఎస్ఎస్. ఈ వందేళ్ల కాలంలో ఆర్‌ఎస్‌ఎస్ అభివృద్ధి చెందుతూ వస్తోంది. కాంగ్రెస్ కు చెందిన కొంతమంది నాయకులు రాజకీయ కారణాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ను చాలా కాలంగా వ్యతిరేకిస్తూ వస్తోన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను బహిరంగంగా వ్యతిరేకించడం వల్ల రాజకీయ లబ్ధి కలుగుతుందనేది వారి నమ్మకం.. రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు.
దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని వ్యతిరేకించే వారు.. ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ లో గానీ, దాని భావజాలంలో గానీ భాగస్వామ్యులు కాలేరని తేల్చి చెప్పారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయనడం దుష్ప్రచారం మాత్రమేనని రామ్ మాధవ్ కొట్టి పారేశారు. ఈ రెండింటి మధ్య భావసారూప్యం ఉందని వివరించారు.
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఒకే సైద్ధాంతిక కుటుంబానికి చెందినవి, దేశ ప్రయోజనాలు అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాయని రామ్ మాధవ్ పేర్కొన్నారు. బీజేపీ రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తోండగా.. సమాజం, ప్రజల మధ్య ఉంటూ వారి ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్ పని చేస్తోందని చెప్పారు. దారులు వేరైనప్పటికీ ఈ రెండింటి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
భారత్‌పై ట్రంప్ 50 శాతం టారిఫ్ విధించడం పట్ల రామ్ మాధవ్ స్పందించారు. ట్రంప్ ను ఒక అవకాశవాదిగా అభివర్ణించారు. తన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ట్రంప్ ఏకైక ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. దీన్ని నివారించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోందని, అధిక టారిఫ్, తదనంతరం తలెత్తిన పరిణామాలను ఎదుర్కొనడంలో ఎక్కడా విఫలం కాలేదని పేర్కొన్నారు.
ట్రంప్ సుంకాలు విధించిన తర్వాత భారత్- అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు దౌత్య సంబంధాలు తిరిగి గాడిలో పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా-భారత్ సంబంధాలు కీలక దశలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. భారత్, అమెరికా రెండూ కలిసి పనిచేయాల్సిన పెద్ద ప్రజాస్వామ్య దేశాలని పేర్కొన్నారు. ఈ క్లిష్ట దశను అధిగమిస్తామనే నమ్మకం తనకు ఉందని అన్నారు.
భారత్- చైనా సంబంధాలపైనా రామ్ మాధవ్ తన అభిప్రాయలను వెల్లడించారు. కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, జాతీయ- అంతర్జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అందరితో సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చైనాతో ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని, గతంలో చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్ అహ్మదాబాద్‌ను సందర్శించారని గుర్తు చేశారు.
గాల్వాన్ సంఘటన తర్వాత, ఈ రెండు దేశాల మధ్య చాలా కాలం పాటు ఉద్రిక్తతలు కొనసాగాయని, ఇప్పుడు చైనాతో సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని, ఇది స్వాగతించదగ్గదేనని రామ్ మాధవ్ తెలిపారు. రెండు దేశాల మధ్య మంచి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని వివరించారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అణు బెదిరింపులు, దానిపై అమెరికా ప్రతిస్పందన గురించి రామ్ మాధవ్ మాట్లాడారు. అణు బెదిరింపులతో ఎవరూ భారత్‌ను భయపెట్టలేరని తేల్చి చెప్పారు. మునీర్‌కు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ తీసుకునే అన్నిరకాల చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, అమెరికా తన సొంత ప్రయోజనాల కోసం ముషారఫ్ విషయంలో ఇలాంటి రాజకీయమే చేసిందని అన్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications