పదేళ్ల జైలు శిక్ష: జడ్జీ ముందు బోరుమన్న డేరాబాబా, భగ్గుమన్న సిర్సా, 2రాష్ట్రాల్లో హైఅలర్ట్
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తాను తప్పు చేయలేదంటూ సీబీఐ జడ్జీ ముందు భోరున విలపించాడు. అంతేగాక, తనపై దయ చూపాలంటూ వాపోయాడు.
రోహ్‌తక్: ఇద్దరు మహిళలపై అత్యాచార కేసులో దోషిగా తేలిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సీబీఐ కోర్టు న్యాయమూర్తి పదేళ్ల శిక్ష ఖరారు చేశారు. తాను తప్పు చేయలేదని, తనపై దయ చూపాలన్న గుర్మీత్ విన్నపాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు.
కాగా, ఇద్దరు మహిళ(బాలిక)లపై అత్యాచారం పాల్పడిన నేపథ్యంలో గుర్మీత్ బాబా జైలు శిక్షను పదేళ్లు, పదేళ్లు అంటే మొత్తం 20ఏళ్ల శిక్ష వేశారు న్యాయమూర్తి.

క్షమించరాని నేరం..
కాగా, తీర్పు చదువుతున్న సమయంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి పలు అంశాలను ప్రస్తావించారు. ఇది క్షమించరాని నేరమని అన్నారు. నమ్మివచ్చిన అమాయకులపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్పు విన్న వెంటనే గుర్మీత్ బాబా కన్నీటి పర్యాంతమయ్యారు.

పదేళ్లు సరిపోదు..
ఇది ఇలా ఉండగా, గుర్మీత్‌కు పదేళ్ల జైలు శిక్ష సరిపోదని, జీవిత ఖైదు వేయాలని అత్యాచార బాధితురాలు డిమాండ్ చేశారు. కాగా, తీర్పు నేపథ్యంలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.

బోరుమన్న బాబా
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తాను తప్పు చేయలేదంటూ సీబీఐ జడ్జీ ముందు భోరున విలపించాడు. అంతేగాక, తనపై దయ చూపాలంటూ వాపోయాడు. ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో సీబీఐ న్యాయమూర్తి సోమవారం శిక్షను ఖరారు చేశారు.

వాదనలు ఇలా..
ఈ సందర్భంగా సీబీఐ, గుర్మీత్ తరపు న్యాయవాదులు న్యాయమూర్తి ముందు తమ వాదనలు వినిపించారు. దోషిగా తేలిన నేపథ్యంలో గుర్మీత్ కు కఠని శిక్ష వేయాలని సీబీఐ న్యాయవాదులు వాదించారు. కనీసం పదేళ్ల జైలు శిక్ష అయినా వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉంటే.. గుర్మీత్ ఒక సామాజిక కార్యకర్త అని ఆయన తరపున న్యాయవాది న్యాయమూర్తికి తెలిపారు. ప్రజల ప్రయోజనాల కోసం ఎంతో చేశాడని చెప్పారు. గుర్మీత్ చేసిన మంచిని కూడా పరిగణలోకి తీసుకోవాలని న్యాయమూర్తిని కోరారు.

జైలే కోర్టు..
హర్యానాలోని రోహ్‌తక్‌లో గుర్మీత్‌ను ఉంచిన జైల్లోనే ఓ ప్రత్యేక గదిని న్యాయస్థానంగా మార్చి.. విచారణ చేపట్టారు. గుర్మీత్‌ను దోషిగా తేల్చిన న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ కాసేపట్లో శిక్ష ఖరారు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా జస్టిస్ జగ్దీప్ సింగ్‌ను పంచకుల నుంచి రోహ్‌తక్‌కు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు.

15ఏళ్ల క్రితం నేరం
గుర్మీత్ ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు 2002లో కేసు నమోదైంది. పదిహేనేళ్ల తర్వాత ఈ కేసులో గుర్మీత్‌ను దోషిగా తేలుస్తూ.. గత శుక్రవారం పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

భారీ విధ్వంసం
గుర్మీత్‌ను దోషిగా తేల్చడంతో అతడి అనుచరులుభారీ విధ్వంసానికి పాల్పడ్డారు.
పంచకుల సహా పంజాబ్, హరియాణాలోని పలు ప్రాంతాల్లో అల్లర్లకు దిగారు. వందల సంఖ్యలో కార్లకు నిప్పుపెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘర్షణల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాల్పులు తప్పవు..
ఈ ఆందోళనల దృష్ట్యా సోమవారం రోహ్‌తక్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతేగాక, ఆందోళనలకు దిగితే ముందు హెచ్చరిస్తామని అప్పటికీ వినకపోతే.. కాల్పులకు సైతం వెనుకాడబోమని పోలీసులు తేల్చి చెప్పారు.

సిర్సా, గుర్మీత్ ప్రధాన ఆశ్రమంలో ఉద్రిక్తత
గుర్మీత్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో సిర్సాలో ఆందోళనకారులు వాహనాలను తగలబెడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. గుర్మీత్ ప్రధాన ఆశ్రమంలోనూ బాబా అనుచరులు భారీగా చేరుకుని ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు.

సీఎంల అత్యవసర సమావేశం
బాబాకు శిక్ష ఖరారైన అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. కోర్టు తీర్పును ప్రజలు గౌరవించాలని, సంయమనం పాటించాలని కోరారు. పంజాబ్, హర్యానా సీఎంలు తమ తమ రాష్ట్రాల్లో భద్రతపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications