పన్నీర్ సెల్వం మద్దతుదారులకు చెక్, పదవుల నుండి తప్పించిన శశికళ
తన నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన వారిపై వేటు వేస్తోంది శశికళ. పన్నీర్ సెల్వానికి మద్దతుగా నిలిచిన వారిపై చర్యలు తీసుకొంటోంది.
చెన్నై:తన నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మద్దతుగా నిలుస్తోన్న నాయకులకు చెక్ పెడుతున్నారు అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ. పార్టీ పదవుల నుండి తనను వ్యతిరేకించేవారిని తప్పిస్తున్నారు.
మంగళవారం రాత్రిపూట శశికళకు వ్యతిరేకంగా నోరువిప్పారు పన్నీర్ సెల్వం. దీంతో తమిళనాడు రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొంటున్నాయి.
అన్నాడిఎంకెలో శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలుగా చీలిపోయారు.పన్నీర్ సెల్వానికి మద్దతుగా నిలుస్తోన్న నాయకులను పార్టీ నుండి బయటకు పంపుతున్నారు శశికళ.

అన్నాడిఎంకె ఐటి విభాగం కార్యదర్శిగా ఉన్న జి. రామచంద్రన్ పన్నీర్ సెల్వానికి మద్దతుగా నిలిచారు.దీంతో ఆయనను ఆ పదవి నుండి తప్పిస్తూ శశికళ నిర్ణయం తీసుకొన్నారు.రామచంద్రన్ స్థానంలో వివిఆర్ రాజ్ సత్యయాన్ ను నియమిస్తూ ఆమె నిర్ణయం తీసుకొన్నారు.
తనపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన పన్నీర్ సెల్వాన్ని పార్టీ కార్యదర్శి పదవి నుండి తప్పిస్తూ ఆమె నిర్ణయం తీసుకొన్నారు. అయితే తాను పార్టీలోనే ఉన్నానని ఏ పార్టీలో చేరబోనని పన్నీర్ సెల్వం ప్రకటించారు.












Click it and Unblock the Notifications