వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో రంజాన్ నెలవంక దర్శనం ఎప్పుడో తెలుసా ? పండుగ ప్రత్యేకతలివే..

|
Google Oneindia TeluguNews

భారత్ లో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పండుగ త్వరలో ప్రారంభ కాబోతోంది. రంజాన్ నెల ప్రారంభానికి గుర్తుగా నెలవంక దర్శనం ఉంటుంది. నెలవంక దర్శనం తర్వాత ప్రారంభమయ్యే ఈ పండుగ నెల రోజుల పాటు కొనసాగుతుంది. దీంతో నెలవంక దర్శనానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో భారత్ లో నెలవంక దర్శనం కోసం ముస్లింలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Recommended Video

Eid Mubarak 2020 : Importance Of Ramadan Festival | Oneindia Telugu

భారత్ లో ముస్లింలు అత్యంత పవిత్ర మాసంగా భావించే రంజాన్ లో నెలవంక దర్శనం కీలకం. నెలవంక దర్శనం నుంచే రంజాన్ మానం ప్రారంభమవుతుంది. తిరిగి నెలవంక దర్శనంతోనే రంజాన్ మాసం ముగుస్తుంది. ఈ ఏడాది నెలవంక దర్శనం ఏప్రిల్ 2న జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ నెలవంక దర్శనం ముందుగా గల్భ్ దేశాల్లో జరుగుతుంది. గల్ఫ్ దేశాల్లో నెలవంక దర్శనం జరిగిన 24 గంటల తర్వాత భారత్ లో జరగడం ఆనవాయితీగా వస్తోంది.

ramzan moon sighting 2022 in india, what is the importance of the festival

గల్ఫ్ దేశాలకూ, భారత్ కూ మధ్య ఉన్న సమయాల్లో తేడా కారణంగా ఇలా ఒక్కరోజు ఆలస్యంగా భారత్ లో నెలవంక దర్శనం ఉంటుంది. అలాగే రంజాన్ ముగింపు సమయంలోనూ నెలవంక దర్శనం గల్ఫ్ దేశాల్లో ఒకరోజు ముందుగా జరుగుతుంది. ఆ తర్వాత భారత్ లో ఉంటుంది.

రంజాన్ మాసం సందర్భంగా భారత్ లో ముస్లింలు పలు నగరాల్లో ప్రత్యేక ప్రార్ధనలతో పాటు ఉపవాసాలు కూడా నిర్వహిస్తారు. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల కావడంతో దానధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పేదల ఆకలి బాధను స్వయంగా అనుభవించడం ద్వారా వారి కష్టాల్ని తెలుసుకునేందుకు అల్లాను ప్రసన్నం చేసుకునేందుకు ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడతారు. ఖురాన్ కూడా ఇదే చెబుతోంది. దీంతో ఈ ఉపవాస దీక్షలకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది.

English summary
like every year, ramadan festival is going to begin in few days with moon sight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X