భారత సొలిసిటర్ జనరల్ పదవికి.. రంజిత్ కుమార్ రాజీనామా
ఇండియన్ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాలను శుక్రవారం ఆయన న్యాయశాఖకు అందజేశారు. కుటుంబ కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. సొలిసిటర్ జనరల్
న్యూఢిల్లీ: ఇండియన్ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాలను శుక్రవారం ఆయన న్యాయశాఖకు అందజేశారు. కుటుంబ కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
సొలిసిటర్ జనరల్‌గా తనకున్న బిజీ షెడ్యుల్ కారణంగా కొద్దికాలంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యపరమైన ఇబ్బందులపై కూడా దృష్టిసారించలేకపోయానని, ఇప్పటికైనా తన కుటుంబ సభ్యులకు తగిన సమయం కేటాయించాలనే తలంపుతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు కుమార్ మీడియాకు తెలిపారు.

సొసిలిటర్ జనరల్‌గా తనకు విశేషానుభవం ఉందని, ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిన తీరుపై కూడా సంతృప్తిగా ఉన్నానని రంజిత్ కుమార్ చెప్పారు. 2014లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సొలిసిటర్ జనరల్‌గా కుమార్‌ను నియమించింది.
సుప్రీంకోర్టులో పలు కీలక కేసుల్లో కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన వాదించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తరపున బెంగుళూరు కోర్టులో కూడా రంజిత్ కుమార్ వాదించారు.
సొలిసిటర్ జనరల్‌గా నియామకానికి ముందు ఆయన గుజరాత్ ప్రభుత్వ న్యాయవాదిగా, సుప్రీంకోర్టులో పలు కేసుల్లో అమికస్ క్యూరీగా వ్యవహరించారు.
సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసు కూడా ఇందులో ఉంది.












Click it and Unblock the Notifications