ఆప్ నేతలు గ్యాంగ్ రేప్ చేశారు! : ఢిల్లీ పోలీసులకు మహిళ ఫిర్యాదు
న్యూఢిల్లీ : ఓ వివాదం తెర మీదనుంచి తప్పుకోగానే మరో వివాదం ఆప్ మెడకు చుట్టుకుంటోంది. ఢిల్లీ అధికారి పార్టీ అయిన ఆమ్ ఆద్మీపై తాజాగా కొత్త వివాదం వెలుగుచూసింది. ఎన్నికల్లో టికెట్ ఆశ చూపి ఆప్ నేతలు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఓ మహిళ.

ప్ నేతలు రామ్ ప్రసాద్ గోయల్, భూపేంద్ర తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని రోహిణీ సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రస్తుతం నిందితుల కోసం వేట ప్రారంభించారు. పంజాబ్ ఎన్నికల వేళ పార్టీకి మచ్చ తెచ్చే వ్యవహారం తెరపైకి రావడం.. ఆమ్ ఆద్మీకి నష్టం చేకూర్చేదిగా మారింది.












Click it and Unblock the Notifications