భారత్‌కు చెడ్డపేరు: విదేశీ స్త్రీల రేప్‌పై కోర్టు, కూతురి రేప్.. తండ్రికి జైలు
ఢిల్లీ: అత్యాచారాలు, విదేశీ మహిళల పైన అత్యాచారాల పైన కోర్టు మంగళవారం తీవ్రంగా స్పందించింది. విదేశీ మహిళల పైన అత్యాచారం భారత దేశానికి చెడ్డ పేరు తీసుకు వస్తుందని కోర్టు పేర్కొంది. ఉగాండాకు చెందిన మహిళ పైన అత్యాచారం చేసిన కేసులో ఇద్దరికి కోర్టు ముప్పై ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ సందర్భంగా.. విదేశీ మహిళలను టార్గెట్ చేయడం ద్వారా, నిందితులు భారత దేశం యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను ఆలోచించడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి సంఘటనలు.. భారత దేశంపై ప్రపంచానికి చెడు దృష్టిని కలిగిస్తాయని పేర్కొంది. ఇది దేశానికి చెడ్డ పేరు అని పేర్కొంది.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కోర్టు నిందితులైన రాజ్ కుమార్, దినేష్‌లకు ముప్పై ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగండా యువతిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారు.
అనంతరం ఆమె వద్ద నున్న వాటిని దోచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరికి ముప్పై ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు చెరో రూ.50వేల జరిమానా విధించింది. వాటిని బాధితురాలికి అందజేయాలని న్యాయస్థానం తెలిపింది.
పెంపుడు కూతుర్ని రేప్ చేసిన తండ్రికి కోర్టు శిక్ష
మైనర్ అయిన పెంపుడు కూతురు పైన రేప్ చేసి, గర్భవతిని చేసిన సంఘటనలో పెంపుడు తండ్రికి న్యాయస్థానం శిక్ష విధించింది. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది. నిందితుడికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షను తగ్గించేందుకు కోర్టు నిరాకరించింది. కాపాడవలసిన తండ్రే కాటేశాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications