డిన్నర్ పార్టీకి వెళ్లి వస్తూ కారు ఎక్కిన మహిళపై డ్రైవర్ రేప్

మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్‌ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుింది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు.
డ్రైవర్‌ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురకు చెందిన శివ కుమార్ యాదవ్ (32)గా గుర్తించారు. కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది. ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద దింపేసి విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు.
బాధిత మహిళ కారు నెంబర్ ప్లేట్ ఫోటో తీసింది. ఆ తర్వాత సంఘటనపై సమాచారం ఇవ్వడానికి పిసిఆర్ కాల్ చేసింది. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే, ఆమెకు మత్తు పదార్థాలు ఏవీ ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications