లేగదూడపై అత్యాచారం వీడియో వైరల్: నలుగురు అరెస్ట్; అమానుష ఘటనపై మిన్నంటిన నిరసనలు

అభం శుభం తెలియని, నోరు లేని మూగజీవం అయిన లేగదూడపై అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఆడ లేగ దూడపై అత్యాచారం చేసిన ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో కలకలం రేగింది.

ఆవు దూడపై అత్యాచారం.. వీడియో చిత్రీకరణ

ఆవు దూడపై అత్యాచారం.. వీడియో చిత్రీకరణ

నిందితుల్లో ఒకరు రోడ్డుపై పడుకొని ఉన్న దూడపై అత్యాచారం చేయగా, మరో నిందితుడు శబ్దం చేయకుండా దాని నోటికి చేతిని అడ్డుపెట్టి అడ్డుకోవడం వైరల్ వీడియోలో ఉంది. ఘటన జరిగిన సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉన్నారు. వారు ఈ చర్యను చిత్రీకరించారని తెలుస్తుంది. అల్వార్ జిల్లాలోని చోపంకిలోని కొండ ప్రాంతంలో ఈ చర్యకు పాల్పడినట్లు నిందితులపై ఫిర్యాదు చేసిన ఫతే మహమ్మద్ అనే వ్యక్తి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

నలుగురు నిందితులు అరెస్ట్

నలుగురు నిందితులు అరెస్ట్

ఈ కేసులో నలుగురు నిందితులు అయిన జుబైర్, తలీమ్, వారిస్ మరియు చునాలను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. తిజారా హర్యానా మరియు రాజస్థాన్‌లోని కొన్ని భాగాలను కలిగి ఉన్న మేవాత్ ప్రాంతం క్రిందకు వస్తుంది. గతంలో ఆవుల అక్రమ రవాణా, పోలీసులు, స్మగ్లర్ల మధ్య ఎన్‌కౌంటర్లు, మూకుమ్మడి హత్యలు జరిగిన సంఘటనలు ఈ ప్రాంతంలో నమోదయ్యాయి.

నిందితులు అందరూ యువకులే ..దూడకు వైద్య పరీక్షలు

నిందితులు అందరూ యువకులే ..దూడకు వైద్య పరీక్షలు


నిందితులందరూ 20-22 ఏళ్ల మధ్య కలవారు. ఈ అబ్బాయిలు సరదాగా గడపాలనుకున్నారు. నిందితుల్లో ఒకరు ఈ అసహజ చర్యకు పాల్పడ్డారు. మరొకరు దూడను పట్టుకున్నారు. మరో నిందితుడు ఈ చర్యను చిత్రీకరించాడు మరియు మరొక నిందితుడు అక్కడ చూస్తూ నిలబడ్డాడు అని అల్వార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శంతను కె సింగ్ చెప్పారు. నిందితులపై సెక్షన్ 377 [భారత శిక్షాస్మృతి యొక్క] కింద కేసు నమోదు చేయబడింది. ఆడ దూడకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ దూడ నిందితులు ఉన్న అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తికి చెందినదని శాంతను కె సింగ్ అన్నారు.

 వీడియో వైరల్ గా మారటంతో తిజారాలో పెద్ద ఎత్తున ఆందోళన

వీడియో వైరల్ గా మారటంతో తిజారాలో పెద్ద ఎత్తున ఆందోళన

బుధవారం, రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని తిజారాలో అన్ని వర్గాలకు చెందిన వేలాది మంది ప్రజలు పాదయాత్ర నిర్వహించి, ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా యంత్రాంగానికి మెమోరాండం అందజేశారు. హేయమైన చర్యకు నిరసనగా అల్వార్ జిల్లా తిజారాలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో దాదాపు 5,000 మంది ప్రజలు పాల్గొన్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనకు నిరసనగా ఆ ప్రాంతంలో దుకాణాలు మూసివేశారు.

Recommended Video

    రాష్ట్రంలో చిన్నారులపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయన్న మహిళా కాంగ్రెస్ || Oneindia Telugu
     నిందితుల పక్షాన వాదించకూడదని న్యాయవాదుల నిర్ణయం

    నిందితుల పక్షాన వాదించకూడదని న్యాయవాదుల నిర్ణయం

    కాగా, ఈ కేసులో నిందితుల్లో ఎవరికీ వాదించకూడదని స్థానిక న్యాయవాదులు నిర్ణయించారు. నోరు లేని మూగ జీవాలను కూడా వదలని కామాంధులను శిక్షించాలని స్థానికులు అంటున్నారు . క్రూరమైన చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నేరస్తులకు ఉరిశిక్ష విధించాలని ఆందోళనకారులు అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+