జయా బచ్చన్‌కు రేసుగుర్రం విలన్ కౌంటర్.. ఇండస్ట్రీలో డ్రగ్స్‌పై మాటల యుద్ధం..

బాలీవుడ్ డ్రగ్స్ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. నిన్న నటుడు, ఎంపీ రవికిషన్ చేసిన కామెంట్స్ దుమారం రేపింది. ఇవాళ రాజ్యసభలో ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తక్కువ చేసి మాట్లాడొద్దు, పరిశ్రమను చిన్నగా చేయొద్దు అని వ్యాఖ్యానించారు. దీనికి రేసుగుర్రం విలన్ రవికిషన్ స్పందించారు. తాను చేసిన కామెంట్లకు కట్టుబడి ఉన్నానని.. తన వ్యాఖ్యలను జయా కూడా గౌరవిస్తారని భావిస్తున్నానని తెలిపారు.

తన అభిప్రాయాన్ని జయాబచ్చన్ కూడా గౌరవించాలని రవికిషన్ చెప్పారు. తాను ప్రీస్ట్ కుమారుడినని.. కష్టపడి ఇండస్ట్రీలో ఎదిగానని గుర్తుచేశారు. 600 సినిమాల వరకు పని చేశానని తెలిపారు. ఈ అంశంపై తన అభిప్రాయాలకు జయ మద్దతు ఇస్తారని భావిస్తున్నానని చెప్పారు. ప్రపంచంలో పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీని నాశనం చేస్తున్న వారి గురించి మాత్రమే తాను మాట్లాడానని తెలిపారు. పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.

ravi kishan response on jaya bachchan drug comments

అంతకుముందు బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. ఆయన పేరు ప్రస్తావించకుండా జయ బచ్చన్ కామెంట్ చేశారు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని తక్కువచేసేలా కామెంట్ చేయడం సరికాదన్నారు. వినోద రంగానికి చెందిన వ్యక్తులను విమర్శిస్తున్నారని తెలిపారు. అలాంటి భాష వాడి సినిమా ఇండస్ట్రీకి చెందినవారిని తక్కువ చేయొద్దని సూచించారు. కానీ మీరు మొత్తం పరిశ్రమ పేరు/ ప్రఖ్యాతలను దెబ్బతీయలేరు అని.. కొందరు చేసిన తప్పుకు అందరినీ నిందించడం సరికాదన్నారు.

Recommended Video

    India-China Stand Off : China విషయమై Parliament సమావేశాల్లో కీలక ప్రకటన చేయనున్న రక్షణ మంత్రి!!

    డ్రగ్స్ గురించి నిన్న బీజేపీ ఎంపీ రవికిషన్ ప్రస్తావించారు. బాలీవుడ్ మొత్తాన్ని మాదకద్రవ్యాలు ప్రభావితం చేసిందని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేసేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. చైనా, పాకిస్తాన్ నుంచి దేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయని తెలిపారు. ఇక్కడి యువతను చెడగొట్టేందుకు పొరుగుదేశాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+