తమిళనాడు "కరూర్ తొక్కిసలాట"కు కారణాలు ఇవేనా..!
తమిళనాడు కరూర్‌లో స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో చిన్నారులు, మహిళలు సహా 39 మంది మృతి చెందగా 111 మంది గాయపడ్డారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ హృదయ విదారక ఘటన తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దుర్ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది.
ఈ తొక్కిసలాటపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన తమిళనాడు పోలీసులు.. FIRలో TVK పార్టీకి చెందిన ముగ్గురు నేతలను చేర్చారు. ప్రభుత్వం ఇప్పటికే అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయగా.. అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. అలానే తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ సైతం ఆరా తీసినట్టు సమాచారం. సీఎం స్టాలిన్ సైతం బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలోనే ఈ విషాదానికి గల కారణాలు ఏంటని జోరుగా చర్చ నడుస్తోంది.

తొక్కిసలాటకు దారితీసిన కారణాలు..
కాగా పార్టీ అంచనా ప్రకారం సభకు 10,000 మంది మాత్రమే హాజరు కావాలని భావించి అనుమతులు తీసుకున్నారు. అయితే ర్యాలీకి అనూహ్యంగా 27,000 మందికి పైగా అభిమానులు చేరడంతో పరిస్థితి అదుపు తప్పింది. సభ స్థలంగా లైట్‌హౌస్ రౌండ్‌టానా సమీపం ఎంపిక చేయబడింది. 1.2 లక్షల చ. అడుగుల విస్తీర్ణం ఉన్నప్పటికీ, ఇంత భారీ రద్దీని నిర్వహించడానికి ఏర్పాట్లు తగినంతగా చేయలేదని అంటున్నారు. తమిళనాడు డీజీపీ జి.వెంకటరామన్ వివరాల ప్రకారం ఈ ఘోర దుర్ఘటనకు ఐదు ప్రధాన లోపాలు కారణమయ్యాయని తెలుస్తోంది.
కారణాలు..
అంచనాల్లో వైఫల్యం..
నిర్వాహకులు 10,000 మంది మాత్రమే వస్తారని భావించి ఏర్పాట్లు చేశారు. నిజానికి 27,000 మంది హాజరయ్యారు.
భద్రతా సిబ్బంది పరిమితి..
27,000 మందిని నియంత్రించడానికి కేవలం 500 మంది పోలీసులే ఏర్పాటు చేశారు. సరైన బారికేడ్లు, క్యూలైన్‌లు లేకపోవడం వల్ల పరిస్థితి అదుపు తప్పింది.
షెడ్యూల్ జాప్యం..
సభ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాలనుకున్నప్పటికీ, విజయ్ సుమారు 7:40 PMకి మాత్రమే చేరారు. దాదాపు ఏడు గంటలపాటు వేచి ఉన్న అభిమానులు ఎండ, ఉక్కపోతలో, ఆహారం, నీరు లేకుండా తట్టుకోలేకపోయారు.
నిర్వాహకుల నిర్లక్ష్యం..
వేచి ఉన్న ప్రజలకు తాగునీరు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కూడా అందించడం విఫలమైంది.
క్రౌడ్ మేనేజ్‌మెంట్ లోపం..
విజయ్ వాహనం సమీపించగానే అభిమానులు ఒక్కసారిగా వేదిక వైపు దూసుకెళ్లారు. ఎమర్జెన్సీ ద్వారాలు లేకపోవడం, నియంత్రణలో లోపం వల్ల తొక్కిసలాట చోటుచేసుకుంది.
మరోవైపు ఈ దుర్ఘటన పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి లక్ష రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. అలానే విజయ్ సైతం మరణించిన వారి కుటుంబాలకు 20 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి రెండు లక్షల రూపాయల చొప్పన పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలు, గాయపడ్డవారిని తాను స్వయంగా కలుస్తానని, వారిని ఓదార్చుతానని అన్నారు.
என் நெஞ்சில் குடியிருக்கும் அனைவருக்கும் வணக்கம்.
— TVK Vijay (@TVKVijayHQ) September 28, 2025
கற்பனைக்கும் எட்டாத வகையில், கரூரில் நேற்று நிகழ்ந்ததை நினைத்து, இதயமும் மனதும் மிகமிகக் கனத்துப் போயிருக்கும் சூழல். நம் உறவுகளை இழந்து தவிக்கும் பெருந்துயர்மிகு மனநிலையில், என் மனம் படுகிற வேதனையை எப்படிச் சொல்வதென்றே…
అలానే కరూర్ ఘటనపై ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. పరిహారం ప్రకటించారు. తమిళనాడు కరూరులో జరిగిన ఘటనలో మరణించిన వారి కుటుంబానికి ప్రధానమంద్రి జాతీయ ఉపశమనం నిధుల నుండి (PMNRF) రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000లు పరిహారంగా అందజేయనున్నట్లు వెల్లడించారు.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications