గెటప్ ఛేంజ్ చేసిన ప్రధాని మోదీ

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. దేశంలో 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును చేపట్టంది. దీని అంచనా వ్యయం 24,470 కోట్ల రూపాయలు. భవిష్యత్తులో

ఆయా రైల్వే స్టేషన్లన్నీ కూడా మల్టీ పర్పస్ సెంటర్లుగా ఆవిర్భవించనున్నాయి. సిటీ సెంటర్స్‌గా అభివృద్ధి చెందనున్నాయి. దీనికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రైల్వే శాఖ ఇదివరకే సిద్ధం చేసింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేయడానికి తెలంగాణలో 21, ఏపీలో 18 స్టేషన్లను కేంద్రం ఎంపిక చేసింది.

Redevelopment of 508 railway stations: PM Modi lays foundation stone

దొనకొండ, ఏలూరు, కాకినాడ టౌన్, విజయనగరం, దువ్వాడ, ఒంగోలు, తుని, రేపల్లె, కర్నూలు, భీమవరం టౌన్, ఏలూరు, సింగరాయకొండ, నర్సాపురం, అనకాపల్లి, నిడదవోలు, కర్నూలు సిటీ, పర్తూరు, పిడుగురాళ్ల స్టేషన్లు ఉన్నాయి. ఈ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ దేశ రాజధాని నుంచి ఈ 508 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఆయా రాష్ట్రాలకు సంబంధించిన చారిత్రక వారసత్వ సంపద, సంస్కృతిని ప్రతిబింబించేలా రైల్వే శాఖ ఆ రైల్వే స్టేషన్లను రీడెవలప్‌మెంట్ చేయనుంది. ఇందులో వాస్తుకూ ప్రాధాన్యత ఇవ్వనుంది. అత్యాధునిక ఆర్కిటెక్చర్‌, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆయా స్టేషన్లన్నీ అభివృద్ధి చెందుతాయి.

దివ్యాంగుల కోసం వీల్ ఛైర్లను అందుబాటులో ఉంచుతారు. ఆధునిక ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు. ర్యాంపులు, కేఫ్‌ ఏరియా, రెస్ట్‌రూమ్స్‌ హైస్పీడ్‌ వైఫై 5జీ సేవలు ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొస్తారు. అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయిలో వాటన్నింటినీ రీ డెవలప్‌ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు.

Redevelopment of 508 railway stations: PM Modi lays foundation stone

ఈ పథకం కింద ఉత్తరప్రదేశ్-55, రాజస్థాన్‌-55, బిహార్‌-49, మహారాష్ట్ర- 44, పశ్చిమ బెంగాల్‌- 37, మధ్యప్రదేశ్‌- 34, అస్సాం- 32, ఒడిశా- 25, పంజాబ్‌- 22, గుజరాత్-21, తెలంగాణ-21, జార్ఖండ్‌- 20, తమిళనాడు-18, ఏపీ-15, హర్యానా-15, కర్నాటక- 13 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మూడు సంవత్సరాల కాల పరిమితిలో వాటన్నింటినీ రీ డెవలప్‌ చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఈ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రైళ్లు, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొ్నారు. 76 సంవత్సరాల స్వతంత్ర భారత్‌లో రైల్వేలు అత్యంత నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురయ్యాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ డిఫరెంట్ గెటప్‌లో కనిపించారు. సాధారణంగా ఆయన తెల్లరంగ జుబ్బా, దానిపై కోటును ధరిస్తుంటారు. ఈ సారి పర్పుల్ కలర్ జుబ్బాను ధరించారు. ముదురు పర్పుల్ కలర్ కోటును ధరించారు. మెడ వద్ద బటన్‌ను ధరించి కొత్త లుక్‌లో అదరగొట్టారు మోదీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+