వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో భారీగా తగ్గిన మరణాలు .. గత 24 గంటల్లో 38,164 కొత్త కేసులు, 499 మరణాలు

|
Google Oneindia TeluguNews

భారత దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతుందని, థర్డ్ వేవ్ ముప్పు ఆగస్టులోనే పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది. అయినప్పటికీ ప్రజలలో కరోనా మహమ్మారి పట్ల ఆందోళన సన్నగిల్లినట్టు కరోనా నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న తీరు స్పష్టం చేస్తోంది. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (మోహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం భారతదేశం గత 24 గంటల్లో 38,164 కొత్త కరోనా కేసులను నమోదు చేసింది. దీంతో భారతదేశంలో ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసులు 3,11,44,229 కు చేరుకుంది.

గత 24 గంటల్లో 38,660 తాజా రికవరీలు చోటు చేసుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,03,08,456 గా ఉంది. కోవిడ్ -19 రికవరీ రేటు ఇప్పుడు 97.31 శాతంగా ఉంది. ఇక గత 24 గంటల్లో 499 మరణాలతో, మొత్తం మరణాల సంఖ్య 4 14,108 కు చేరుకుంది. క్రియాశీల కేసులు ఆదివారం గణాంకాల నుండి 995 తగ్గాయి, ఇప్పుడు 4, 21,665 వద్ద క్రియాశీల కేసులున్నాయి. ఇది మొత్తం కరోనా కేసులలో 1.36 శాతం గా ఉంది.

reduced deaths in India .. 38,164 new cases, 499 deaths in last 24 hours

నిన్న ఆదివారం 41,157 కొత్త కేసులు నమోదు కాగా, నేడు నిన్నటి గణాంకాల కంటే 2,993 తక్కువ ఉన్నందున సోమవారం రోజువారీ కరోనా కేసులలో తగ్గుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో కరోనావైరస్ వ్యాధికి 14,63,593 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి యొక్క మూడవ వేవ్ వస్తుందని పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న వేళ ఆరు రాష్ట్రాలు ఇటీవల కేసులలో భారీగా పెరుగుదల చూపిస్తున్నాయి.

Recommended Video

Covid-19 Third Wave Likely In August India To See 1 Lakh Cases Daily Says ICMR Scientist

ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. కేరళ మరియు మహారాష్ట్రలలో సంఖ్యలు పెరగడం తీవ్ర ఆందోళనకు కారణంగా మారుతుందని పిఎం మోడీ సమావేశంలో అన్నారు.రెండవ వేవ్ రాకముందే జనవరి నుండి ఫిబ్రవరి వరకు దేశంలో ఇలాంటి పోకడలు గుర్తించామని ప్రధాని మోదీ హైలైట్ చేశారు. కరోనా వ్యాప్తిని ఎదుర్కోవటానికి చురుకైన చర్యలు తీసుకోవాలని మరియు 'టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్' విధానాన్ని అనుసరించాలని ఆయన ఆరు రాష్ట్రాలను కోరారు.

English summary
India recorded 38,164 new cases in the last 24 hours, taking the country’s cumulative tally to 3,11,44,229. With 38,660 fresh recoveries and 499 fatalities in the same period,death toll reached to 414,108, respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X