తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి ధర.. నేడు ధరలిలా!!
సహజంగా ఆషాడం ముగిసిన తర్వాత వచ్చే శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో శ్రావణమాసంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తగ్గిన బంగారం ధరలు
గత కొన్ని వారాలుగా బంగారం ధరల పతనం సామాన్య మధ్యతరగతి ప్రజలకు మళ్లీ బంగారాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచనకు కారణంగా మారుతుంది. ఇక దేశవ్యాప్తంగా నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గగా వెండి ధర భారీగా పెరిగింది. ఇక నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఏపీ, తెలంగాణాలో బంగారం ధరలిలా
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66, 940 గాను, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 73,030 రూపాయలు గాను ఉంది. తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలలో నేడు బంగారం ధర పై విధంగా ఉంది.
ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో బంగారం ధరలు ఇలా
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 67, 090 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 73,180 రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66, 940 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 73,030 రూపాయలు. ముంబైలో మాత్రమే కాదు కలకత్తా బెంగళూరులో కూడా ఇదే ధర కొనసాగుతుంది.
పెరిగిన వెండి ధరలు
ఇక తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,940 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,030 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా మంగళవారం రోజు వెండి ధర బాగా పెరిగింది. కిలో వెండిపై 600 రూపాయలు ధర పెరిగింది . ప్రస్తుతం వెండి ధర 92,800గా నమోదయింది.
ప్రధాన నగరాలలో వెండి ధరలిలా
దేశంలోని ప్రధాన నగరాలలో వెండి ధరలను పరిశీలిస్తే చెన్నైలో కిలో వెండి ధర 93,500 గా ఉంది. బెంగళూరులో వెండి ధర కాస్త తగ్గింది. 400 రూపాయలు తగ్గటంతో అక్కడ వెండి ధర తగ్గి 84000 కొనసాగుతుంది ఇక కలకత్తా ఢిల్లీ, ముంబై నగరాలలో కిలో వెండి ధర 88,500 వద్ద ఉంది.












Click it and Unblock the Notifications